సీతంపేట/వీరఘట్టం: జేఈఈ అడ్వాన్స్‌డ్–2026 ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న ఐఐటీ సూపర్–60 బ్యాచ్‌లో శిక్షణ పొందిన సవర వెంకట రావు అనే విద్యార్థి ఎస్టీ కేటగిరీలో జాతీయస్థాయి లో 473వ ర్యాంకు సాధించాడు. అలాగే, ఎస్టీ కేటగిరీలో సవర మణి–810, కుంజాం శ్రీలత– 865, సవర బాగ్యలక్ష్మి –1309, సవర దీనా–1793, డి. స్వాతీబాయ్–2012 ర్యాంకులు సాధించారు. విద్యార్థులను పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ పవార్ స్వప్నిల్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర అభినందించారు.
●వీరఘట్టంకు చెందిన భోగి శ్రీకర్ జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షలో 152 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 5,446, ఈడబ్ల్యూఎస్‌లో 644 ర్యాకు సాధించాడు. విద్యార్థిని తల్లిదండ్రులు సుజాత, శ్రీధర్ అభినందించారు.
●గరుగుబిల్లి మండలంలోని హిక్కింవలస గ్రామానికి చెందిన పెంట శ్రీశాంత్ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా కేటగిరీలో 651వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 108వ ర్యాంకు సాధించాడు.


