సాక్షి, పార్వతీపురం మన్యం: ఈపీడీసీఎల్ పార్వతీపురం మన్యం సర్కిల్(ఆపరేషన్) ఎస్‌ఈగా పి.త్రినాథరావు నియమితులయ్యారు. విజయనగరం సర్కిల్‌లో టౌన్ డీఈగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై జిల్లాకు వస్తున్నారు. ప్రస్తుతం ఎస్‌ఈగా పనిచేస్తున్న కె.మల్లికార్జునరావుకు విశాఖపట్నం బదిలీ అయ్యింది. పార్వతీపురం పట్టణ డీఈ కె.గోపాలరావునాయుడును విజయనగరం రూరల్ డివిజన్ డీఈగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విశాఖపట్నం నుంచి ఆర్.రామునాయుడు ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు. పార్వతీపురం ఏడీఈ(కనస్ట్రక్షన్స్)ఎం. లక్ష్మీ నారాయణ ఉద్యోగోన్నతిపై విజయనగరం డీఈగా అదే విభాగానికి వెళ్తున్నారు. ఈయన స్థానంలో విజయనగరం నుంచి రెడ్డి ఈశ్వరరావు నియమితులయ్యారు.


