జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తూడెం విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తూడెం విద్యార్థులు

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తూడెం విద్యార్థులు

పూసపాటిరేగ: భోగాపురం మండలంలోని తూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్‌లో పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచిన పాఠశా ల విద్యార్థులు వి. వసంత్‌, యు. దీపిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే గతేడాది డిసెంబర్‌లో చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచిన ఇదే పాఠశాలకు చెందిన ఆర్‌. ప్రవీణ్‌ కూడా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థులు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ మేరకు విద్యార్థులను హెచ్‌ఎం వి.అప్పన్న, పీడీ సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement