బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవు

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవు

విజయనగరం క్రైమ్‌: బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎ.ఆర్‌.దా మోదర్‌ ఓ ప్రకటనలో ఆదివారం హెచ్చరించారు. ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నందున క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా జరుగుతోందన్న ప్రచారం ఉందని, వతిగృహాలు, లాడ్జిలు, విద్యార్థులు, యు వత గుమిగూడి ఉండే చోట్ల తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బెట్టింగ్‌ జోలికి వెళ్లి జీవి తం నాశనం చేసుకోవద్దని, ఎవరి ఫోన్‌లో అయినా బెట్టింగ్‌ యాప్‌లు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని కోరారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌లేవీ చేసినా నేరమేనని, బెట్టింగ్‌ ఆడేవారి తో పాటు నిర్వాహకులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు పలుచోట్ల ఎస్‌ఐ గణేష్‌ తన సిబ్బంది తో కలిసి ఆదివారం తనిఖీలు చేశారు.

నెల్లిమర్ల: మండలంలోని మొయిద జంక్షన్‌లో ఎస్‌ బి.గణేష్‌ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీల తో పాటు యువత, విద్యార్థుల స్మార్ట్‌ఫోన్లలో బెట్టింగ్‌ యాప్‌లపై తనిఖీలు నిర్వహించారు. బెట్టింగ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకుని కన్నవారికి ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టవద్దని, ఎంతోమంది బెట్టింగ్‌లతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయని ఉదహరించారు. ఎవరి ఫోన్‌లో అయినా బెట్టింగ్‌ యాప్‌లు ఉంటే తొలగించాలని సూచించారు. అలాగే ఎవరైనా ఎక్కడైనా పేకాట ఆడినా బెట్టింగ్‌ వేస్తున్నా ఫోన్‌ నంబర్‌ 91211009444కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement