నివాళులు.. | - | Sakshi
Sakshi News home page

నివాళులు..

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష

విజయనగరం క్రైమ్‌ : జిల్లా నేర సమీక్ష విభా గంలో (డీసీఆర్బీ) హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఎ.జగదీశ్వరరావు (49) గుండెపోటు తో ఆదివారం మృతి చెందారు. విషయం తెలు సుకున్న ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్యూనరల్‌ ఖర్చులు, ఫ్లాగ్‌ ఫండ్‌ అందజేశారు. జగదీశ్వరరావుకు 11వ తేదీ రాత్రి గుండెపోటు రాగా కుటుంబ సభ్యు లు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, సీఐలు కె.కుమారస్వామి, ఆర్‌వీఆర్‌కే చౌదరి, సీహెచ్‌ సూరిదేముడు, బి. లక్ష్మణరావు, పోలీస్‌ అసోసియేషన్‌ కె. శ్రీనివాసరావు, తదితరులున్నారు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌లో పట్టణ యువకుడి ప్రతిభ

విజయనగరం అర్బన్‌: కఠిన శ్రమ, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పట్టణానికి చెందిన యువకుడు చిప్పాడ రవిప్రసాద్‌ నిరూపించారు. ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ (స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌) ఫలితాల్లో ఆయన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సూపరింటిండెంట్‌గా ఎంపికయ్యాడు. పట్టణంలోని సీబీ కాలనీకి చెందిన రవిప్రసాద్‌ మొదటి ప్రయత్నంలోనే ఈ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. బీటెక్‌ పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ రంగంలో పని చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చదివానని రవిప్రసాద్‌ తెలిపారు. ఇతని తండ్రి ప్రభుదాస్‌ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో సహాయ సంబంధాల అధికారిగా పనిచేస్తున్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి

మృతి

బలిజిపేట: మండలంలోని పెదపెంకిలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మజ్జి శంకరరావు (60) ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు. గ్రామంలోని సచివాలయానికి విద్యుత్‌ సరఫరా లేదని చెప్పడంతో మరమ్మతులకు ఆదివారం వెళ్లాడు. మరమ్మతులు చేపడుతుండగా..విద్యుత్‌షాక్‌తో ఒక్కసారిగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సబ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సీతంపేట: స్థానిక స్కిల్‌ కళాశాలలో కంప్యూటర్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లపై శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నెలల పాటు ఇవ్వనున్న శిక్షణలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణానంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనఆనరు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఆపైన చదివిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 63034 64426, 91824 88958 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.

నెల్లిమర్ల రూరల్‌/డెంకాడ: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నెల్లిమర్ల మండలంలోని సతివాడ ఆదర్శ పాఠశాలలో 369 మంది, డెంకాడ మండలంలోని అక్కివరం మోడల్‌ స్కూల్‌లో 175 మంది పరీక్ష రాసినట్లు ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు పద్మలత, సంధ్యలు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కూడా చేశామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement