పదవుల కోసమే కళా తాపత్రయం | - | Sakshi
Sakshi News home page

పదవుల కోసమే కళా తాపత్రయం

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకోం

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

రాజాం: గతంలో మంత్రిగా చేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావుకు ఇప్పుడు ఏ పదవి లేకపోవడంతో ఏమి చేయాలో అర్ధం కావడం లేదని, పదవులు పొందేందుకు ప్రతిపక్ష పార్టీపైన, నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. రాజాంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై కళా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగతంగా దూషించిన వీటిని వెనక్కు తీసుకోకుంటే మేం కూడా కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత దూషణలకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎదుటివారిపై దూషణలు చేసేటప్పుడు తమ పరిస్థితి వెనక్కు తిరిగి చూసుకోవాలని హితవు పలికారు. మరోవైపు మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులపై కళాకు పూర్తిగా అవగాహన లేదని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఉణుకూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో కళా చేసిన అభివృద్ధి శూన్యమని, ఆయా నియోజకవర్గాలకు వెళ్తే కళా పనితనం తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ ఘనత వైఎస్సార్‌ కుటుంబానికే దక్కుతుందని తెలిపారు. మూలపేట పోర్టు 70 శాతం పనులు పూర్తి చేయించిందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని, ఇది ముమ్మాటికి సత్యమని అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్‌ను మేమే తెచ్చామని చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకున్నారని, ఆ ప్రాజెక్ట్‌ వైఎస్సార్‌సీపీ హయాంలో పూర్తవుతుందని అన్నారు. రాష్ట్ర రాజధాని అక్కడి ప్రభుత్వ ఇష్టమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఇప్పు డు అమరావతిని రాజధానిని చేస్తున్నామంటూ కూటమి తీర్మానాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ అమరావతి తీర్మానాలు చేయలే దా? అని ప్రశ్నించారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న రైతులను ఆదుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేస్తుంటే తప్పుదోవ పట్టించే పని కూట మి చేస్తుందని మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం చేయకుండా కూటమి దోచుకుంటుందని ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్న సంగతి కూటమి నేతలకు తెలుసని అన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలిసిన కూటమి ఎమ్మెల్యేలు... టీవీలు ముందు మాట్లాడే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడా ల్సి ఉంటుందని అన్నారు. పార్టీ రాజాం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ తలే రాజేష్‌, జెడ్‌పీ వైస్‌ చైర్మన్‌ సిరిపురపు జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement