ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి : యూటీఎఫ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి : యూటీఎఫ్‌

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి : యూటీఎఫ్‌

పార్వతీపురం రూరల్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద ఒకరోజు నిరాహార దీక్షలు బుధవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు, జిల్లా అధ్యక్ష ప్రధా న కార్యదర్శులు కె.కృష్ణారావు, కె.భాస్కరరావు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్‌ వెంటనే నియమించాలని, 29 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడంతో పాటు, ఇతర ఆర్థిక బకాయి ల చెల్లింపునకు స్పష్టమైన రోడ్డు మ్యాప్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు, మెమో 57 అమలు, హెల్త్‌ స్కీమ్‌ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 28న రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొ న్నారు. జేఏసీ జిల్లా చైర్మన్‌ జి.వి.ఆర్‌.కె.కిషోర్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు పి.మధుసూదనరావు, కోశాధికారి కె.మురళి, జిల్లా కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, ఎం.పైడిరాజు, బి.రామకృష్ణ, కె.సిద్ధేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement