ప్రకృతి సాగు.. ప్రగతికి బాట | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సాగు.. ప్రగతికి బాట

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

ప్రకృతి సాగు.. ప్రగతికి బాట ● ఖరీఫ్‌పై యంత్రాంగం కసరత్తు ● పంట మార్పిడితోనే మేలు: కలెక్టర్‌

● ఖరీఫ్‌పై యంత్రాంగం కసరత్తు ● పంట మార్పిడితోనే మేలు: కలెక్టర్‌

పార్వతీపురం రూరల్‌ : ఖరీఫ్‌ సాగులో ముందస్తు ప్రణాళికలు, ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా రైతులకు మేలు చేకూర్చాలని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్జీఓ భవనంలో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరి శ్రమ, డీఆర్‌డీఏ, ప్రకృతి వ్యవసాయ విభాగాల సిబ్బందికి నిర్వహిస్తున్న రెండో రోజు శిక్షణ కార్యక్ర మంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలోనినో ప్రభావం వల్ల సాగులో తలెత్తే ఇబ్బందులను అధిగమించేలా రైతులను సన్నద్ధం చేయాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, దేశీ విత్తనాలు, ప్రకృతి సాగు వైపు మళ్లించాలని సూచించారు. పంట మార్పిడి, మార్కెటింగ్‌ అంశాలపై క్షేత్ర స్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని, రాబోయే ఏడాదికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. రైతుల నమ్మకాన్ని పొందేలా అధికారులు తమ వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి జి.సత్యవతి మాట్లాడుతూ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని సాగు చేపట్టాలన్నారు. ఉద్యాన అధికారి సత్యం నారాయణరెడ్డి శాఖాపరమైన సబ్సిడీల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఎం.శ్రావణ్‌కుమార్‌నాయుడు మాట్లాడుతూ.. బయోరిసోర్స్‌ సెంటర్ల వినియోగం, వరి సాగు లో రైజ్డ్‌ బెడ్స్‌ పద్ధతి, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు, ఎంఏఓలు, హార్టీకల్చర్‌ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

మందుల చీటీలు తెలుగులోనే రాయాలి

పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు ఇచ్చే మందుల చీటీలను సామాన్యులకు అర్థమయ్యేలా స్పష్టంగా తెలుగులోనే రాయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి వైద్యులను ఆదేశించారు. చాకల బెలగంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బంది తో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పి ంచాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ భాస్కరరావు, మున్సిపల్‌ కమిషనర్‌ డి.పావని, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement