గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
పాలకొండ రూరల్: మండలంలోని పణుకువలస కూడలి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై కె.ప్రయోగమూర్తి అందించిన వివరాల మేరకు మండలంలోని బుక్కూరు గ్రామానికి చెందిన పొట్నూరు రామినాయుడు(57) పణుకువలస నుంచి తన స్వగ్రామం వస్తుండగా వీరఘట్టం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొంది. దీంతో రామినాయుడు తీవ్రంగా గాయపడగా పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య చిన్నమ్మడు మరణించగా కుమార్తె రూప ఉంది. తండ్రి మరణంతో నిరుపేద కుటుంబానికి చెందిన కుమార్తె ఒంటరిగి మిగిలింది. వ్యవసాయ వేతనదారుగా, పశువుల కాపరిగా గ్రామస్తులతో కలివిడిగా ఉండే రామినాయుడు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


