సరుకుల సరఫరాకు టెండర్లు
సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాలు, కళాశాలలకు కాస్మోటిక్స్, నిత్యావసర సరుకుల సరఫరాకు అధికారులు మంగళవారం టెండర్లు నిర్వహించారు. జీసీసీ ఆధ్వర్యంలో నూనెలు, కందిపప్పు, మినపపప్పు, శనగ పలుకులు, ఇడ్లీనూక, కారం, పసుపు తదితర 25 రకాల నిత్యావసర సరుకులు, 10 రకాల కాస్మోటిక్స్ సరఫరాకు 9 మంది టెండర్ దారులు హాజరయ్యారు. టెండర్లు దక్కించుకున్నవారు ఈ నెల నుంచి ఫిబ్రవరి 2026 వరకు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని ఐటీడీఏ ఏపీఓ ఎస్.వి.గణేష్ ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, జీసీసీ డీఎం సంధ్యారాణి, సీతంపేట, పాతపట్నం బ్రాంచ్ మేనేజర్లు దాసరి కృష్ణ, గొర్లె నరసింహులు, ఏటీడబ్ల్యూవోలు, హెచ్‌డ బ్ల్యూవోలు పాల్గొన్నారు.
డీఈఓగా బ్రహ్మాజీరావు
పార్వతీపురం: జిల్లా విద్యాశాఖాధికారిగా పి.బ్రహ్మజీరావును నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. అల్లూరి జిల్లా డీఎస్‌ఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను పార్వతీపురం మన్యం జిల్లాకు పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ బదిలీ చేశారు. ఇక్కడ డీఈఓగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న రాజ్‌కుమార్ డిప్యూటీఈఓగా కొనసాగనున్నారు. బ్రహ్మజీరావుకు గతంలో పార్వతీపురం మన్యం జిల్లాలో డీఈఓగా, పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ ఈఓగా పనిచేసిన అనుభవం ఉంది. గత ఏడు నెలలుగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చిందని, రెగ్యులర్ డీఈఓను నియమించిందని ఉపాధ్యాయ, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. బ్రహ్మజీరావు గురువారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పాఠశాల నుంచి కళాశాల స్థాయిలో గల క్రీడాకారులను, ప్రతిభావంతులను గుర్తించి, వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో విద్యార్థి స్థాయి నుంచి కళాశాల వరకు కూడా ప్రత్యేక దృష్టి సారించి, క్రీడలపై పూర్తి స్థాయి తర్ఫీదు ఇవ్వడానికి వీలుగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా 13 క్రీడా విభాగాలలో జిల్లా స్థాయిలో ఎంపికలు జరుగుతాయని, జిల్లా వ్యాప్తంగా ఎంపికలను నిర్వహించి తగిన ప్రతిభ, అర్హత కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారు ఎక్కడ చదువుతున్నప్పటికీ ఒక ప్రత్యేకమైన స్పోర్ట్స్ స్కూల్‌ను గుర్తించి తగిన తర్ఫీదు ఇవ్వనున్నామని చెప్పారు.
12న కోటదుర్గమ్మ హుండీల ఆదాయం లెక్కింపు
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మవారి హుండీల ఆదాయా న్ని ఈ నెల 12న లెక్కిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ మంగళవా రం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ పెద్దలు, పురోహితులు, దేవదాయశాఖ, పోలీస్ అధికారుల సమక్షంలో ఉదయం 9 గంటలకు హుండీలను తెరచి కానుకలు లెక్కిస్తామన్నారు.
మెరుగైన విద్యాబోధన అందించాలి
● విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ విజయభాస్కర్
నెల్లిమర్ల: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని పాఠశాల విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కె.విజయభాస్కర్ సూచించారు. నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీచ్‌టూల్ శిక్షణను ఆయన పరిశీలించారు. శిక్షణకు సంబంధించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు సూర్యనారాయణమూర్తి, జ్ఞానశంకర్, తదితరులు పాల్గొన్నారు.
సరుకుల సరఫరాకు టెండర్లు


