సీపీఎస్ రద్దు చేయాలి
● కలెక్టర్‌కు ఏపీ సీపీఎస్‌ఈఏ నాయకుల వినతి
విజయనగరం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు అమలవుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏపీ సీపీఎస్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడువ బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. జిల్లా ఖజానా కార్యాలయంలో సీపీఎస్ ఉద్యోగులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా సీపీఎస్ రద్దుపై ఊసేలేదని విమర్శించారు. జీతాలు, డీఏ, పీఆర్‌సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కరీం రాజేశ్వరరావు, చీరల కిరణ్‌కుమార్, ఎల్బీ యుగంధర్, జి.సతీష్‌కుమార్, ఎస్టీయూ ఆదినారాయుణ, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ రద్దు చేయాలి


