● రబీలోనూ వీడని యూరియా వెతలు
ఖరీఫ్‌లో యూరియా కోసం తిప్పలు పడిన రైతులకు రబీలోనూ కష్టాలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం సాగులో ఉన్న కూరగాయలు, మొక్కజొన్న, ఉద్యానవన పంటలకు జల్లేందుకు యూరియా దొరకడం లేదు. చీపురుపల్లి మండలంలోని అలజంగి, గొల్లలములగాం, పెదనడిపల్లి, చీపురుపల్లి రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం పంపిణీ చేసిన యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలానికి 49 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పంపిణీకి వ్యవసాయ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. పోలీసుల సమక్షంలో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. – చీపురుపల్లి


