రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి

Dec 9 2025 10:35 AM | Updated on Dec 9 2025 10:35 AM

రాష్ట

రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి

జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌

కార్యదర్శులు గోపాల్‌, విజయలక్ష్మి

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజేతలుగా తిరిగి రావాలని జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శులు కె.గోపాల్‌, ఎస్‌.విజయలక్ష్మిలు ఆకాంక్షించారు. ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరగనున్న అండర్‌ –14 బాలబాలికల ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్లతో పాటు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో జరగనున్న అండర్‌–17 బాలుర హాకీ పోటీల్లో పాల్గొనబోయే జట్టు సోమవారం బయల్దేరాయి. ఈ సందర్భంగా జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శులు వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. విద్యార్థి దశలో క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు మంచి భవిష్యత్‌ ఉంటుందని, ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభాపాటవాలు కనబరచాలని ప్రోత్సహించారు. తద్వారా జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించి, ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి1
1/1

రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement