తండ్రే హంతకుడు
● అనుమానాస్పద మృతిలో వీడిన మిస్టరీ
పాలకొండ రూరల్: ఇటీవల పాలకొండ మండలం బుక్కూరు గ్రామంలోని స్వగృహంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ జామి విఠల్‌రావు (49) మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీఐ ఆమిటి ప్రసాదరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. వ్యసనాలకు బాని సైన విఠల్‌రావు నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను వేదిస్తుండేవాడన్నారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన రాత్రి మద్యం మత్తులో వచ్చిన విఠల్‌రావు ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో మృతుడి తండ్రి రామప్పడు కోపం తట్టుకోలేక, సహనం కల్పోయి గొడ్డలితో తన కుమారుడిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన విఠల్‌రావు మృతి చెండాడు. తమ దర్యాప్తులో తండ్రి ఈ నిజం అంగీకరించినట్లు సీఐ సోమవారం మీడియాకు తెలిపారు. మండల వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ మృతి కేసును కేవలం 7 రోజుల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన రోజు జాగిలాలు ఘటన స్థలం చుట్టూ తిరిగి రామప్పడు వద్దకు వచ్చి నిలిచిపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్థి
మెంటాడ: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతున్న కిలారి రామ్‌చరణ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. రామ్‌చరణ్ ఆడుకుంటూ మేడపైకి వెళ్లి అక్కడున్న ఊచను పైకెత్తి పట్టుకున్నాడు. ఈ క్రమంలో పై నుంచి వెళ్తున్న 11కేవీ విద్యుత్ తీగలకు ఇనుప ఊచ తగలడంతో షాక్‌కు గురయ్యాడు. అరచేతులు బొబ్బలెక్కాయని, అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదమే తప్పిందని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికై నా పాఠశాల పై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.


