ఒడిశా వద్దు– ఆంధ్రాయే ముద్దు
సాలూరు: వివాదాస్పద ఆంధ్రా–ఒడిశా సరిహద్దు కొటియా గ్రూపు గ్రామాల్లో పలువురు గిరిజనులు ఒడిశా వద్దు–ఆంధ్రాయే ముద్దు అంటూ తీర్మానం చేశారు. పట్టుచెన్నేరు గ్రామ సమీపంలో పగులుచెన్నేరు, గంజాయిభద్ర, పట్టుచెన్నేరు పంచాయతీల పరిధిలోని గిరిజనులు సోమవారం సమావేశమయ్యారు. ఒడిశా అధికారుల తీరు సరిగా లేదని, ఆ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్, రేషన్ సరుకులతో పాటు మరే పథకాల లబ్ధిని తీసుకోరాదని నిర్ణయించారు. కలిసికట్టుగా ఆంధ్రావైపే ఉండాలని నిర్ణయించారు. ఆంధ్రా ప్రభుత్వం, అధికారులకు మద్దతు ఇవ్వాలని కోరారు.


