గిరిజన జీవన విధానంపై అధ్యయనం
సీతంపేట: గిరిజన జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలపై తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ, అభ్యుదయ కవి గోరటి వెంకన్న సోమవారం అధ్యయనం చేశారు. సీతంపేట మండలంలోని అక్కన్నగూడ గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీ గిరిజనులతో మాట్లాడారు. వారు మాట్లాడే భాష, పండగలు జరుపుకుంటున్న విధానం తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. అభ్యసన తీరును పరీక్షించారు. ఆయన వెంట సీఎంఓ చిరంజీవి, టీడబ్ల్యూటీయూ నాయ కుడు మూటక రవి, తదితరులు పాల్గొన్నారు.
13, 14 తేదీల్లో జెన్‌ఏఐ హ్యాక్‌థాన్ సమ్మిట్
● విజయవంతం చేయాలని జేఎన్‌టీయూ జీవీ వీసీ సుబ్బారావు పిలుపు
విజయనగరం రూరల్: జేఎన్‌టీయూ జీవీలో ఈ నెల 13, 14న నిర్వహించనున్న జెన్‌ఏఐ హ్యాక్‌థాన్ సమ్మిట్‌ను విజయవంతం చేయా లని వర్సిటీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు పిలుపునిచ్చారు. జెన్‌ఏఐ వర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న ‘జెన్‌ఏఐ హ్యాక్‌థాన్ ఫర్ నెక్ట్స్ జెనరేషన్ జాబ్స్’ వాల్‌పోస్టర్‌ను వర్సిటీలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ భవిష్యత్ ఉద్యోగాల రూపకల్పనలో జనరేటివ్ ఏఐ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జెన్‌ఏఐ వర్సిటీ భాగస్వామ్యంతో జాతీయస్థాయి హ్యాక్‌థాన్‌ను నిర్వహించడం ఒక ముందడుగని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను బోధన, పరిశోధన వ్యవస్థల్లో సమన్వయం చేసి విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడమే జేఎన్‌టీయూ జీవీ లక్ష్యమన్నారు. 48 గంటల పాటు జరిగే హ్యాక్‌థాన్ విద్యార్థులకు వాస్తవ ప్రపంచ ఏఐ సవాళ్లను పరిష్కరించే అవకాశం లభిస్తుందన్నారు. ఆధునిక ఏఐ సాధనాలతో ప్రత్యక్ష అనుభవం పొందడానికి ఈ కార్యక్రమం వేదిక కానుందని తెలిపారు. వివిధ విద్యా సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, సాంకేతికతకు కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, ఆచార్యులు, పాల్గొన్నారు.
8వ తేదీ వచ్చినా జీతాల్లేవు
● రెండు శాఖల ఉద్యోగులు మినహా మిగిలిన వారికి అందని జీతం
విజయనగరం అర్బన్:
‘వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలో కట్టుకున్న ఇల్లుకోసం బ్యాంకు రుణం తీసుకున్నారు. రుణం నెలవారీ వాయిదా మొత్తం 5వ తేదీలోపు జీతం నుంచి జమచేసుకోవాలని బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు 8వ తేదీ వచ్చినా జీతం జమకాకపోవడంతో అకౌంట్ బౌన్స్ చార్జీలతో పాటు సెబీ విలువ పడిపోయి డిఫాల్టర్‌గా మారిపోయాడు.’ ఇది ఒక వ్యవసాయ శాఖ ఉద్యోగి సమస్యేకాదు. విద్య, పోలీస్ శాఖ ఉద్యోగులు మినహా జిల్లాలోని మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి అని ఆయన వాపోయాడు.
అంతన్నారు.. ఇంతన్నారు... ప్రజాసంక్షేమ పథకాలను పక్కనపెట్టేశారు. కనీసం ఉద్యోగుల జీతాలను కూడా ఒకటో తేదీన చెల్లించలేని దుస్థితిలో చంద్రబాబు సర్కారు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లలో లక్షలకోట్ల రూపాయలు అప్పుడుచేసిన సర్కారు... జీతాల చెల్లింపులో జాప్యంపై ఉద్యోగవర్గాలు మండిపడుతున్నాయి. జీతాల చెల్లింపులో వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నాయి. 8వ తేదీ ముగిసినా జీతాలు చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వివిధ విభాగాల్లో సుమారు 57 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 24 వేల మంది వరకు ఉన్న టీచర్లు, పోలీస్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు వేశారు. మిగిలిన వివిధ శాఖల సిబ్బందికి వేతనాలు పడలేదు. జీతాల చెల్లింపులో ఆలస్యంపై ఆయా ఉద్యోగవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఓటేసిన పాపానికి అనుభవిస్తున్నామంటూ మదనపడుతున్నాయి.
గిరిజన జీవన విధానంపై అధ్యయనం


