మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Dec 9 2025 10:34 AM | Updated on Dec 9 2025 10:34 AM

మంగళవ

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

నిబంధనలు కఠినతరం చేయాల్సిందే.. ఏదో ఒక మెలిక పెడుతున్నారు.. మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట పడదా? యథేచ్ఛగా మిల్లర్ల దోపిడీ

న్యూస్‌రీల్‌

అందరిదీ ఒకటే మాట

క్వింటాకు 5 కిలోలు అదనంగా ఇస్తేనే ధాన్యం దించేది..

చోద్యం చూస్తున్న అధికారులు

అందరికీ అన్నంపెట్టే రైతులను ఆదుకోకపోతే ఎలా? కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడం, మిల్లర్ల దోపిడీ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించాలి. ధాన్యం సేకరణలో నిబంధనలు కఠినతరం చేయాలి.

– గులిపిల్లి అప్పలనాయుడు, రైతు సంఘం నాయకుడు

పంట పండించిన తర్వాత ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. లోడింగ్‌, రవాణా.. ఇలా అన్ని విషయాల్లోనూ దోపిడీకి గురవుతున్నాం. క్వింటాకు రూ.150 నుంచి రూ.200 వరకు పొలం నుంచి తీసుకురావడానికి ఖర్చవుతోంది. ఆ మొత్తం మేమే పెట్టుకుంటున్నాం. మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ఏదో ఒక మెలిక పెట్టి, దోచుకుంటున్నారు.

– గొర్లె వెంకట జగన్నాథరావు, తంపటాపల్లి, పాలకొండ మండలం

జిల్లాలో మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు జోరుగా ప్రచారం చేశారు. దళారులకు విక్రయించవద్దని చెప్పుకొచ్చారు. అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ఉంది. క్వింటాకు 5 కిలోల నుంచి పది కిలోల వరకు మిల్లర్లు అడుగుతున్నారు. గట్టిగా అడిగితే.. ఏ మిల్లుకు తీసుకెళ్లినా ఇదే పరిస్థితి అని పబ్లిక్‌గా చెబుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నట్లు?

– బుడితి అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం.

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయి పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటోంది. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరణ ఎక్కడా పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇదే మిల్లర్లకు, వ్యాపారులకు అవకాశంగా మారింది. మిల్లర్లు అంతా సిండికేట్‌ అయి, ఒకే తీరున రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో 104 రైస్‌ మిల్లులున్నాయి. క్వింటా ధాన్యానికి ఐదు కిలోలు అదనంగా ఇస్తే గానీ, రైతులు తెచ్చిన బస్తాలను ఎక్కడా దించడం లేదు. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే.. వివిధ సాకులు చూపి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏ మిల్లుకు తీసుకెళ్లినా ఇలానే ఉంటుందని నేరుగా చెబుతున్నారు. దీంతోపాటు దింపుడు కూలీల కింద రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. రైతు నుంచి నుంచి ప్రతి గింజనూ తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఆచరణలో అది అమలు కావడం లేదని రైతులు వాపోతున్నారు.

జిల్లాలోని 150 కొనుగోలు కేంద్రాలు ఉండగా.. ఇప్పటి వరకు లక్ష్యంలో పావువంతు కూడా సేకరణ కాలేదు. దీంతోపాటు.. మిల్లర్ల, వ్యాపారుల అదనపు దోపిడీకి రైతులు బలవుతున్నారు. రైతు పొలం నుంచి బయటకు రావడానికి బస్తాకు రూ.40 ఖర్చు అవుతోంది. తూకానికి రూ.25, లోడింగుకు రూ.10, మిల్లుకు వెళ్లడానికి రూ.50 నుంచి రూ.100 వరకు రవాణా కోసం వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి దోచుకుంటున్నారు. రైతులు ఇవేవీ భరించలేక.. పొలం నుంచి ఇళ్లకు బస్తాలు తీసుకెళ్లలేక ఎంతోకొంతకు వ్యాపారులు, దళారులకే విక్రయించుకుంటున్నారు. అధికారుల తనిఖీలూ తూతూమంత్రంగానే సాగుతున్నాయి.

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ప్రకృతి విపత్తుల వల్ల కోతలు కొన్నిచోట్ల ఆలస్యమయ్యాయి. పంట ముదిరింది. దీంతో కొంత గుండవ్వగా.. మరికొన్ని చోట్ల రంగు మారింది. ఇదే అదునుగా దళారులు, మిల్లర్ల దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారులు వినే పరిస్థితి లేదు. మొక్కుబడిగా తనిఖీలు చేసి ఊరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికార యంత్రాంగం చేతులెత్తేస్తోంది. జిల్లాలో 3.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. 2.50 లక్షల ఎంటీలు కొనుగోలు చేస్తామని పౌరసఫరాల సంస్థ అధికారులు అంటున్నారు. వాస్తవానికి ఏటా వస్తున్న దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటే అంతకుమించి కొనుగోలు చేయాల్సి ఉంది. చివరికి వచ్చేసరికి తమ లక్ష్యం పూర్తయ్యిందని అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే మిల్లర్లు ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం చాలా వరకు సచివాలయాల్లో గ్రేడింగ్‌ చేయడం లేదు. మిల్లర్ల వద్దకే పంపిస్తున్నారు. వారు ఇష్టానుసారం మెలికలు పెట్టి దోచుకుంటున్నారు. తేమశాతమని, రంగు మారిందని, పొల్లు ఎక్కువగా ఉందని సాకులు చెబుతూ క్వింటా వద్ద 5 నుంచి 10 కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారు. పాలకొండ డివిజన్‌ పరిధిలో సబ్‌కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సైతం మిల్లర్ల దోపిడీని గుర్తించి.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. బలిజిపేట మండలంలోని ఓ రైస్‌ మిల్లులో కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి ఆకస్మిక తనిఖీ చేయగా.. అక్కడ తూనిక యంత్రం సరిగ్గా లేకపోవడం, తూకంలో అవకతవకలకు పాల్పడటం గుర్తించారు. మిల్లుకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే మిల్లుల్లో ఉంది.

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20251
1/5

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20252
2/5

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20253
3/5

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20254
4/5

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20255
5/5

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement