కోటి సంతకాల ర్యాలీలను విజయవంతం చేయండి
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నిర్వహించిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సేకరించిన సంతకాల ప్రతులతో ఈ నెల 10న సాలూరులో, 15న జిల్లా కేంద్రంలో నిర్వహించే ర్యాలీల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. సాలూరు పట్టణంలోని తన గృహంలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని ఆఫీషియల్ కాలనీలోని తన గృహం నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ సాగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతుల బాక్సుల వాహనాన్ని మెయిన్‌రోడ్డు వద్ద జెండా ఊపి జిల్లా కేంద్రానికి తరలిస్తామని చెప్పారు.


