స్వరరాగ గంగా ప్రవాహం | - | Sakshi
Sakshi News home page

స్వరరాగ గంగా ప్రవాహం

Dec 6 2025 7:36 AM | Updated on Dec 6 2025 7:36 AM

స్వరర

స్వరరాగ గంగా ప్రవాహం

స్వరరాగ గంగా ప్రవాహం

విజయనగరం టౌన్‌: శతాబ్దిగాయకుడు పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో ఘంటసాలకు 12 గంటల నిర్విరామ ఘంటసాల స్వరాభిషేకం వేడుకగా నిర్వహించారు. వర్ధమాన గాయనీగాయకులు ఆలపించిన ఆపాతమధురాలు ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఇండియన్‌ ఐడల్‌ గాయకులు నజీరుద్దీన్‌, శిరీష, సౌజన్యలు ఘంటసాల గీతాలాపన చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కళాకారులు అద్భుతమైన పాటలతో ఆకట్టుకున్నారు. భారతమాతకు జేజేలు అంటూ చిన్నారులు పాడుతూ చూపరుల కరతాళ ధ్వనులందుకున్నారు. చిన్నారులే సంగీత పరికరాలను వినియోగిస్తూ, నటన కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ చేసిన ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్ధాపకుడు ఎం.భీష్మారావును చిన్నారుల తల్లిదండ్రులు దుశ్సాలువతో ఘనంగా సత్కరించారు. తనవద్దనున్న సంగీత వాయిద్యపరికరం వాయిస్తూనే సంగీత మాంత్రికుడు పద్మశ్రీ డాక్టర్‌ శివమణి స్టేజిపైకి వచ్చి చూపరులను అలరించారు. తన శిష్యుడు భీష్మారావు కుమారులు సాయి,పవన్‌లతో కలిసి సంగీత స్వరఝురి మధురిమలను ప్రదర్శించి విజయనగరవాసులను కట్టిపడేశారు. విభిన్నరకాల సంగీత పరికరాలను శివమణి తనదైనౖశైలిలో వాయిస్తూ పవన్‌తో కలిసి డప్పు వాయిద్య ప్రదర్శనకు ఆడిటోరియంలో ప్రేక్షకులు నిలబడి కరతాళధ్వనులందించి, ఆద్యంతం ఆస్వాదించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ 1909లో మా పూర్వీకులు సంగీత కళాశాలను స్ధాపించారని, అదే కళాశాల నుంచి ఎందరో మహానుభావులు ప్రపంచ వ్యాప్తంగా విజయనగర ఖ్యాతిని వ్యాప్తి చేశారన్నారు. అందులో ఒకరు ఘంటసాల అని గుర్తుచేశారు. నగర డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఘంటసాల స్మారక కళాపీఠం 35 ఏళ్లుగా నిర్విరామ కృషిచేస్తోందన్నారు. ఘంటసాల జయంతి సందర్భంగా శివమణిని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కళాపీఠం ప్రతినిధులు దుర్వాసుల రాజేంద్రప్రసాద్‌, ధవళసర్వేశ్వరరావు, ఈఆర్‌ సోమయాజులు, మేకా అనంతలక్ష్మి, డాక్టర్‌ జి.సన్యాసమ్మ, డాక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, డాక్టర్‌ ఎ.గోపాలరావు, మారుతీ శ్రీనివాస్‌, కాపుగంటి ప్రకాష్‌, అధిక సంఖ్యలో కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు.

శివమణికి ఘంటసాల స్మారక విశిష్ట పురస్కారం

ప్రపంచ ప్రసిద్ధ పెర్కషన్‌ మాస్ట్రో, పద్మశ్రీ డాక్టర్‌ శివమణికి ఘంటసాల స్మారక విశిష్ట పురస్కారాన్ని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల శ్రావణిల చేతుల మీదుగా అందజేసి పెద్దలు గజమాలతో ఘనంగా సత్కరించారు. సువర్ణ కంకణం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, దుశ్సాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

అలరించిన నిర్విరామ సినీ సంగీత విభావరి

తెలుగు ఇండియన్‌ ఐడల్స్‌ అద్భుత గానాలాపన

పద్మశ్రీ డాక్టర్‌ శివమణికి ఘంటసాల స్మారక విశిష్ట పురస్కారం

స్వరరాగ గంగా ప్రవాహం1
1/1

స్వరరాగ గంగా ప్రవాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement