వెటరన్ బాడ్మింటన్ చాంపియన్ షిప్‌కు పేర్లు నమోదు
శృంగవరపుకోట: జిల్లాస్థాయి వెటరన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్, సెలక్షన్‌కు హాజరయ్యేవారు ఈనెల ఏడోతేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్.కోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్‌కోచ్, బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ సీఈఓ పొట్నూరు శ్రీరాములు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి విజయనగరంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా బ్యాడ్మింటన్ ఆసోషియేషన్ చైర్మన్ ఇందుకూరు రఘురాజు, గౌరవ అధ్యక్షుడు ద్వారపూడి జగదీష్, అధ్యక్షుడు కేఏ నాయుడు కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో 35,40,45,50,55,60,65,70ఏళ్ల విభాగాల్లో సీ్త్రలు, పురుషులకు వేర్వేరుగా సింగిల్స్, డబుల్స్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులను ఫిబ్రవరిలో విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి వెటరన్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన దలిచినవారు బొబ్బిలి అపర్ణబాబా 7981111705, ఎస్.కోట పొట్నూరు శ్రీరాములు 7989199534.విజయనగరం జి.శ్రీనివాసరావు9133773485 ఫోన్ నంబర్లకు ఫోన్‌చేసి ఈ నెల 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.


