జాతీయ స్థాయికి ఎంపికై న చెస్ క్రీడాకారులు
సీతానగరం: మండలంలోని జోగింపేట ఎస్‌ఓఈ విద్యాలయంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో మూడురోజులు జరిగిన చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. శుక్ర, శని.ఆదివారాల్లో జరిగిన 79వ రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి 398 మంది క్రీడాకారులు 70 మంది అఫీయల్స్ పాల్గొన్నారు.
జాతీయ స్థాయికి ఎంపికై న ప్రతిభావంతులు..
అండర్ 17, అండర్ 19 వ్యక్తిగత, టీం విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి నేషనల్ టీమ్‌కు ఎంపికై న క్రీడాకారులు వీరే..
అండర్ 19 బాలికలు ఎస్‌జీఎఫ్ ఏపీటీం–2025
ఆత్మకూరి టింపుల్ ప్రియ–నెల్లూరు. లలిత వై–అనంతపురం.
వేముల ప్రద్యుమ్న లక్ష్మి–నెల్లూరు. రెడ్డి నవ్యసాహితి–కృష్ణా.
అండర్ 19 బాలురు ఎస్‌జీఎఫ్ ఏపీటీం
మజ్జిరామ్‌చరణ్‌తేజ–ఈస్ట్‌గోదావరి. అల్లుభాస్కరపద్మశార్ముఖ్ రెడ్డి చిత్తూరు. స్వప్న నిహాల్–చిత్తూరు
అండర్ 17 బాలికలు ఎస్‌జీఎఫ్ 2025....
సెల్వారావు దేవి దీప్తి యాస్వి–ఈస్ట్ గోదావరి. అస్మితా అనిమి–అనంతపురం
లక్ష్మీప్రియా బత్తా–విశాఖపట్నం. జలాది నందిక–కృష్ణా
మధుపాడ మనస్వి–విశాఖ పట్నం
అండర్ 17 బాలురు ఎస్‌జీఎఫ్ 2025..
భార్గవ్ సునీత్ సాకేత్ ఎం–ఈస్ట్‌గోదావరి
గండవరపు కార్తీక్– విశాఖపట్నం
కర్రి ఓంకార్– వెస్ట్‌గోదావరి
(తానీష్ చొప్ప–విశాఖపట్నం
క్రీడాకారులకు అభినందనలు
రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో విజయం సాధించి జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులందరినీ ఎస్‌జీఎఫ్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు అంబినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె ప్రసన్నకుమార్, ఇన్‌చార్జి ఎంపీడీఓ వెంకటరావు, వ్యాయామ అధ్యాపక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


