
ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి
పార్వతీపురంటౌన్: ఓటర్ల జాబితా తయారీలో నిర్దిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అన్నారు. ఓటర్ల జాబితా పునఃశ్చరణపై బూత్ స్థాయి అధికారులకు మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటరు కొత్తగా చేరడం, ఓటరు జాబితా నుంచి తొలగించడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారేటప్పుడు సవరణ చేయడం వంటి ప్రక్రియ ఓటర్ జాబితా సవరణలో ప్రధానమైన అంశాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.