
నరక దారులు
పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న రహదారులతో పాటు ఆంధ్రా–ఒడిశా ప్రాంతాలకు రాకపోకలకు సాగించేందుకు ప్రధానంగా ఉన్న అంతర్‌రాష్ట్ర రహదారి సైతం పూర్తిగా ధ్వంసమై భారీ గుంతలతో చెరువులను తలపిస్తున్నాయి. ప్రజా సంఘాలు, స్థానికులు, వాహన దారులు ఎప్పటికప్పుడు వినూత్నంగా రహదారి అధ్వాన స్థితిపై నిరసనలను తెలియజేస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేస్తామని చేసిన వాగ్దానం ఎక్కడా నెరవేర్చినట్లు కానరావడం లేదని ప్రజా సంఘాల నాయకులు రోడ్ల దుస్థితిపై దుమ్మెత్తి పోస్తున్నారు. వాహనాలు గుంతల్లో తిరగబడి ప్రమాదాలకు గురవుతున్నా పాలకులకు, సంబంధిత అధికారులకు ఎందుకు పట్టడం లేదో అని ఆందోళన చెందుతున్నారు.
కూటమి పెద్దల మాటలు ఏమయ్యాయి?
కూటమి పాలనలో రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. అందుకు ప్రధాన సాక్ష్యం పార్వతీపురం నుంచి కూనేరు వరకు ఉన్న రహదారే. అధికారంలోకి వస్తే అద్దంలా రోడ్లను మారుస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఏడాది పాలన పూర్తయినప్పటికీ రోడ్ల మరమ్మతుల విషయంలో ఎలాంటి పురోగతి చూపడం లేదు. జిలా కేంద్రం సమీపంలోని పార్వతీపురం నుంచి చినబొండపల్లి మధ్య, గరుగుబిల్లి–బురదవెంకటాపురం రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తక్షణమే రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాలి.
బీవీ రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి,

నరక దారులు

నరక దారులు

నరక దారులు

నరక దారులు

నరక దారులు