
ఇదేం కొలువు.. గురూ!
–8లో
● గురువులకు అదనపు ‘తరగతులు’ ● పాఠాలు కంటే ఇతర పనులే అధికం ● ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలు
మీరొస్తేనే.. పూడికలు తీస్తారా?
ఆరోగ్య, అభివృద్ధి ప్రదాత
సానుకూలంగా స్పందించండి
అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై
సానుకూలంగా స్పందించాలని
ఎస్పీ మాధవ్‌రెడ్డి అన్నారు. –8లో
అర్జీలను పరిష్కరించాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ అధికారులకు
హితవు పలికారు.
జిందాల్ భూములు రైతులవే..
జిందాల్ కంపెనీ కోసం సేకరించిన భూములపై పూర్తి హక్కులు రైతులకే ఉన్నాయని మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. –8లో
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025
డీఈవో కార్యాలయం వద్ద నిరసన
తల్లిదండ్రుల సమావేశం కోసం ప్రతి పాఠశాల కూ ఒక ‘సాక్ష్యం’ అధికారిని నియమించడాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పీఆర్‌టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, హెచ్‌ఎంఏ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికా రి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుల కంటే తక్కువ స్థాయి వారిని విట్‌నెస్ అధికారిగా నియమించడం ఏమిటని ప్రశ్నించారు. హంగామా వద్దు.. బోధన ముద్దు అంటూ నినాదాలు చేశారు. తక్షణమే విట్‌నెస్ అధికారి నియామకం రద్దు చేసి, ఉపాధ్యాయుల గౌరవం పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కాగాన విజయ్, భాస్కరరావు, బాలకృష్ణ, పీహెచ్ శ్రీను, రవిప్రసాద్, నారాయణరావు, రామారావు, లక్ష్మునాయుడు, రవి, రామినాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
మొన్నటి వరకూ యోగాంధ్ర.. ఇప్పుడు పేరెంట్స్ మీట్... గురువులకు పాఠాలు కంటే అదనపు ‘తరగతులే’ అధికమవుతున్నాయి. ఈ నెల 10న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశించిన విషయం విదితమే. దీనికి పెద్త ఎత్తున హంగామానే చేస్తున్నారు. కార్యక్రమ నిర్వహణ ఒక ఎత్తయితే.. మరోవైపు హెచ్‌ఎంలను కాదని, ఇతర శాఖల ఉద్యోగులను ‘సాక్ష్యం’ కింద నియమించడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నిర్వహించిన పేరెంట్స్ మీట్‌లోనే ప్రజాప్రతినిధులు.. తల్లిదండ్రులకు రాజకీయ పాఠాలు బోధించారు. ఈసారి కార్యక్రమాన్ని ఇంకే విధంగా ఉపయోగించుకుంటురోనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహణ
ఈ నెల పదో తేదీన జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,787 విద్యాసంస్థల్లో 1,29,730 మంది విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పిలిచి విద్యార్థులను ప్రగతిని వివరించడం.. వారికి అక్క డే మధ్యాహ్న భోజనం, క్రీడల నిర్వహణ, సమావేశం, అతిథుల ప్రసంగాలు.. ఇలా ఉదయం 9 గంటల నుంచే వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాలల్లో 16 రకాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్వాన పత్రికలు, వేదికల ఏర్పాట్లు, బహుమతుల ప్రదానం, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించడం.. ఇలా వివిధ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ బాధ్యతంతా ఉపాధ్యాయులపైనే పడుతోంది. దీనికితోడు కొద్దిరోజులుగా నిత్యం వీసీలు, సమావేశాలంటూ హెచ్‌ఎంలను, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు యోగాంధ్ర పేరిట నెల రోజులపాటు హడావిడి చేశారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇందు లో భాగస్వామ్యం చేయడంతో చదువులు అటకెక్కా యి. మధ్యలో ఆదర్శ పాఠశాలల్లో విలీనం.. వ్యతిరే కిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన.. బడులకు పిల్లలెవరూ రాకపోవడంతో సక్రమంగా పాఠా లు సాగే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు గ్రామాలకు వెళ్లి, తల్లిదండ్రులను నచ్చజెప్పే బాధ్యతను గురువులపైనే మోపారు. అక్కడ గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతనూ ఉపాధ్యాయులే ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొద్దిరోజులుగా తల్లిదండ్రుల సమావేశానికంటూ హంగామా చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో పడి, అసలే విద్యాబోధననే సాగడం లేదని గురువులు ఆందోళన చెందుతున్నారు. యోగాంధ్ర మాదిరి ఈ కార్యక్రమాన్నీ రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్‌లో నమోదయ్యేలా నిర్వహించాలని ఒత్తిడి చేయడంతో తలలు పట్టుకుంటున్నారు.
‘యాప్’రే...
తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా విద్యార్థులతో మొక్కలు నాటించడం.. దాన్ని లీఫ్ యాప్‌లో నమోదు చేయించడం, ప్రతి మూడు నెలలకు ఆ మొక్క ఫొటోలను అప్‌లోడు చేయించడం, సమావేశం జరిగిన వెంటనే 30 సెకన్ల వీడి యో, మూడు ఫొటోలను యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయడం.. ఇదంతా ఉపాధ్యాయుల పనే. ప్రభుత్వ పాఠశాలలను బలపర్చే దిశగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు లేవని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాణ్యమైన విద్యను అందించడం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం వంటి చర్యలు కాకుండా... యోగాడే, మెగా పేరెంట్స్ మీట్ వంటివేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా పాఠశాల సమయాన్ని మొత్తం బోధనకు కాక, బోధనేతర పనులకే ఉపాధ్యాయులు కేటాయించాల్సి వస్తోంది. దీనికితోడు మిగులు ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలలకు కేటాయించకుండా, తిరిగే విధంగా నియమించడం మరింత ప్రభావం చూపుతోంది.
ఇతర శాఖల వారు ‘సాక్ష్యమా?’
తల్లిదండ్రుల సమావేశాల పర్యవేక్షణకు ఒక్కో పాఠశాలకూ ఒక ఉద్యోగిని ఇతర శాఖల నుంచి కేటాయించారు. వీరు సాక్షిగా ఉంటారని విద్యాశాఖ ఉత్తర్వు లు జారీ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫొటోలు, సమాచారమంతా ప్రధానోపాధ్యాయుడు ఉపయోగిస్తున్న యాప్‌లో అదే రోజున అప్‌లోడు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. బాహ్య పరిశీలకులు పేరిట ఇతర శాఖ ల ఉద్యోగులను నియమించడం పాఠశాల నిర్వహ ణ వ్యవస్థ, ఉపాధ్యాయుల పనితీరును కించపరచ డమేనని యూటీఎఫ్, పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
● సొంత పార్టీ కార్యకర్తలకు ఏం చేశారు..
● ఎమ్మెల్యేను నిలదీసిన 28వ వార్డు
టీడీపీ యువత, మహిళలు
న్యూస్‌రీల్

ఇదేం కొలువు.. గురూ!

ఇదేం కొలువు.. గురూ!

ఇదేం కొలువు.. గురూ!

ఇదేం కొలువు.. గురూ!

ఇదేం కొలువు.. గురూ!