
ఆహ్లాదకర వాతావరణంలో పీటీఎం
పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీట్ (పీటీఎం)ను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రముఖు ల హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం సమీక్షించారు. జిల్లాలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పీటీఎం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతికళాశాల, పాఠశాలలో 16 రకాల కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని, వాటి సారథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివరించారు.
మ్యాపింగ్‌లో జాగ్రత్తలు పాటించాలి
బంగారు కుటుంబం మ్యాపింగ్‌లో మార్గదర్శకాలు పాటించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అధికారులకు సూచించారు. బంగారు కుటుంబం – మార్గదర్శి, పీఎం సూర్యఘర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొంత మంది మార్గదర్శులు మొత్తం మండలాన్ని దత్తత తీసుకుంటున్నట్టు వెబ్ సైట్‌లో చూపుతోందని, దీనిని సరిచేయాలన్నారు. జిల్లా, నియోజక వ ర్గం, మండలం, గ్రామ/వార్డు సచివాలయం ఎంపి క చేసుకుని సచివాలయం పరిధిలోని కుటుంబాల ను మాత్రమే ఎంపిక చేయాలని సూచించారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో 312 గృహాలకు యూనిట్లు బిగించినట్టు తెలిపారు. యూనిట్ల నమోదు పెరగాలన్నారు. వర్షాకాలంలో పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టిసారించాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, కేఆర్‌ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్ది, డీఈఓ బి.రాజ్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు పి. రమాదేవి, ఆర్.తేజేశ్వరరావు, వై.నాగేశ్వరరావు, ఎస్.మన్మథరావు, కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.