
● నేడు వైఎస్సార్ జయంతి ● ఆరోగ్యశ్రీ పథకంతో వైద్యభరోసా
విజయనగరం ఫోర్ట్/కొమరాడ:
వైఎస్సార్.. ఈ పేరు వింటేనే పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు ఉద్యోగ వర్గాల మనసు పులకించిపోతుంది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమపాలన చేరువచేసిన ఘనత వైఎస్సార్‌దే. ఆయన హయాంలోనే జిల్లాలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. జంఝావతి రబ్బర్ డ్యామ్ సాకారమైంది. విద్య, వైద్య సదు పాయాలు ప్రజలకు చేరువయ్యాయి. ఫీజురీయింబర్స్ పథకంతో పేద కుటుంబాల విద్యార్థుల ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల కలసాకారమైంది. ఉద్యోగులకు పెద్దమొత్తంలో వేతనపెంపు జరిగింది. ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి సేవలు ప్రజలకు ఆపద్భాంధువులుగా మారాయి. అందుకే.. ఆయన భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు. ఆయన జయంతి వేడుకలను మంగళవారం జరుపుకునేందుకు ఊరూవాడా సన్నద్ధమవుతోంది.
●జిల్లాకు చెందిన విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సూచన మేరకు జేఎన్‌టీయూ కళాశాలను జిల్లాకు మంజూరు చేసిన ఘనత వైఎస్సార్‌దే. ఇంజినీరింగ్ కళాశాలను వర్సిటీగా స్థాయి పెంచేందుకు కృషిచేసినది వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి.
●దశాబ్దాలు గడిచినా ఒడిశా–ఆంధ్రా మధ్య నెలకొన్న వివాదంతో మన్యం రైతులకు సాగునీరు అందని పరిస్థితి. 2006వ సంవత్సరంలో ఆస్ట్రి యా టెక్నాలజీతో జంఝావతి నదిపై రాజ్యలక్ష్మీపురం గ్రామం వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించి సుమారు 12వేల ఎకరాలకు సాగునీటి సదుపాయాన్ని సమకూర్చిన ఘనత వైఎస్సార్‌దే. ఈ రోజు సాగునీరు అంది పంటలు పండుతున్నాయంటే అది వైఎస్సార్ చలువేనన్న మాట తోటపల్లి, మడ్డువలస ఆయకట్టు రైతులనోట ఇప్పటికీ వినిపిస్తుంది.
●ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లాలోని వేలాదిమంది గిరిజన రైతులకు సాగుపట్టాలు అందజేసి హక్కులు కల్పించారు. ఇల్లులేనివారికి ఇల్లు మంజూరు చేశారు.
●108 వాహనాలు అందుబాటులోకి తెచ్చి అత్యవసర వేళ వైద్యభరోసా కల్పించారు. 104 వాహనాలతో పల్లెప్రజలకు వైద్యసేవలను చేరువచేశారు.
●ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంతో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు బాటలు వేసిన మహానుభావుడు వైఎస్సార్. అందుకే.. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయింది.
వైఎస్సార్ కృషి వల్లే...
ఒడిశాతో వివాదం వల్ల దశాబ్దాల నుంచి మూలకు చేరిన జంఝావతి రిజర్వాయర్ నుంచి 12వేల ఎకరాలకు సాగునీరు అందుతుందంటే అది వైఎస్సార్ చలువే. 2006లో మహానేత కృషితో జంఝావతి నదిపై దేశంలో ఎక్కడా లేనివిధంగా రబ్బర్ డ్యాం నిర్మితమైంది. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు జంఝావతి ప్రాజెక్టు అభివృద్ధికి చేసిన సాయం శూన్యం. ఇప్పుడు ఒడిశాలో, ఏపీలో కూటమి పాలనే సాగుతోంది. జంఝావతి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిర్మిస్తే సుమారు 24వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో సమస్యను పరిష్కరిస్తారో లేదో చూడాలి. – నంగిరెడ్డి శరత్‌బాబు, రాజ్యలక్ష్మీపురం

● నేడు వైఎస్సార్ జయంతి ● ఆరోగ్యశ్రీ పథకంతో వైద్యభరోసా

● నేడు వైఎస్సార్ జయంతి ● ఆరోగ్యశ్రీ పథకంతో వైద్యభరోసా

● నేడు వైఎస్సార్ జయంతి ● ఆరోగ్యశ్రీ పథకంతో వైద్యభరోసా