
‘హిట్ అండ్ రన్’ వాహనాలను వెంటనే గుర్తించాలి
● ఎస్పీ ఆదేశాలు
విజయనగరం క్రైమ్: హిట్ అండ్ రన్ కేసుల్లో వాహనాలను వెంటనే గుర్తించాలని నమోదైన కేసుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పోలీస్ సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం అదేశించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదై, దర్యాప్తులో ఉన్న ’హిట్ అండ్ రన్, గుర్తు తెలియని మృతదేహాల కేసులను ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షించారు. ‘హిట్ అండ్ రన్’ కేసుల్లో నేరానికి పాల్పడిన వాహనాన్ని సాధ్యమైనంత వేగంగా గుర్తించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. నేర స్ధలం నుంచి వాహనం వెళ్లే మార్గంలోగల అన్ని సీసీ కెమెరాలను, ఫుటేజులను, టోల్ గేట్స్ రికార్డులను పరిశీలించాలని సూచించారు. కేసుల్లో దర్యాప్తు అంశాలను ఎప్పటికప్పుడు కేసు డైరీల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్‌కే చౌదరి, ఎస్.శ్రీనివాస్, ఎల్.అప్పలనాయుడు, బి.సుధాకర్, వివిధ పోలీసు స్టేషన్ల చెందిన పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.