
ఈపీడీసీఎల్ ఎస్‌ఈ బాధ్యతల స్వీకరణ
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏపీ ఈపీడీసీఎల్ పార్వతీపురం మన్యం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా కె.మల్లికార్జునరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో సంస్థలో విధుల్లో చేరిన ఆయన.. గతంలో పాడేరు ఆపరేషన్ ఈఈ గానూ, శ్రీకాకుళం జిల్లాలో ఈఈ/డీపీఈ గానూ పని చేశారు. ప్రస్తుతం ఉద్యోగోన్నతిపై సర్కిల్ రెండో ఎస్‌ఈగా ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. మన్యం సర్కిల్ తొలి ఎస్‌ఈగా వచ్చిన చలపతిరావు ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. సిబ్బంది సహకారంతో జిల్లాలో మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని మల్లికార్జునరావు తెలిపారు.
సురక్షిత ప్రసవమే లక్ష్యం
● జిల్లా ఎన్సీడీ ప్రొగ్రాం అధికారి
జగన్‌మోహన్‌రావు
కొమరాడ: సురక్షిత ప్రసవమే లక్ష్యంగా గర్భిణులకు వైద్యసేవలు అందించాలని జిల్లా ఎన్సిడీ ప్రొగాం అధికారి డాక్టర్ టి.జగన్‌మోహన్‌రావు వైద్యులకు సూచించారు. కె.ఆర్.బి.పురం, కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీల్లో అందుతున్న వైద్యసేవలను గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. గిరిశిఖర గ్రామాలకు చెందిన గర్భిణులను ప్రసవ సమయానికి ముందుగానే వైటీసీలో చేర్చాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యులు అరుణ్‌కుమా ర్, గణేష్ పట్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
11న ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాక
విజయనగరం అర్బన్: ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్‌గా ఎన్నికై న విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఎన్నికై న డీవీరమణ ఈ నెల 11న తొలిసారి జిల్లాకు రానున్నారని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.శ్రీధర్‌బాబు, సురేష్, సహ అధ్యక్షులు జీవీఆర్‌ఎస్ కిశోర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి వై జంక్షన్‌లో ఘన స్వాగతం పలుకుతామన్నారు. అక్కడి నుంచి జెడ్పీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీతో స్వాగతిస్తామని చెప్పారు. మధ్యాహ్నం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా, తాలూకా యూనిట్ కార్యవర్గం, జేఏసీ మిత్ర సంఘాల కార్యవర్గంతో సమావేశం నిర్వహించి అనంతరం ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, యూనిట్ కార్యవర్గ సభ్యులు హాజరుకావాలని కోరారు.

ఈపీడీసీఎల్ ఎస్‌ఈ బాధ్యతల స్వీకరణ