
చదువు కోసం కొండెక్కాల్సిందే..
సాలూరు మండలంలో చాలా గ్రామాల గిరిజన విద్యార్థులు చదువుకోసం కొండలు ఎక్కుతున్నారు. ఒకరికిఒకరు తోడుగా చదువుకోసం ముందుకు సాగుతున్నారు. క్రమశిక్షణతో చదువులు సాగిస్తున్నారు. ఉపాధ్యాయులు సమయానికి రాకున్నా ప్రార్థన చేస్తూ బుద్ధిగా కూర్చుంటున్నారు. దీనికి కురుకూటి పంచాయతీ ఎగువ కాషాయివలస, కరడవలస గ్రామాల చిన్నారులే నిలువెత్తు సాక్ష్యం. ఎగువకాషాయివలస గ్రామానికి చెందిన 9 మంది చిన్నారులు ప్రతిరోజూ రాళ్లదారిలో కిలోమీటరు దూరంలో ఉన్న కరడవలస ప్రాథమిక పాఠశాలకు చదువుకోసం రాకపోకలు సాగిస్తున్నారు. సరైన దారిలేకపోవడంతో నిత్యం కష్టాలు పడుతున్నారు. ఇటీవల ఇదే గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు డోలీలో ఆస్పత్రి తరలించిన విషయం తెలిసిందే. గిరిజన సంక్షేమ శాఖమంత్రి సంధ్యారాణి స్పందించి చిన్నారులు పాఠశాలకు చేరుకునేందుకు అనువుగా రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – సాలూరు రూరల్

చదువు కోసం కొండెక్కాల్సిందే..