
●రేగాలమ్మా.. కాపాడమ్మా..
గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామంలో రేగాలమ్మ తల్లి వారాల పండగను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏటా వరి ఉభాలు ప్రారంభించే ముందు
మంగళ, బుధవారాల్లో అమ్మవారికి మొక్కులు చెల్లించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా సర్పంచ్ కేతిరెడ్డి శిరీష, గ్రామపెద్దలతో కలిసి గ్రామస్తులు
ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు.
– గరుగుబిల్లి
పల్లపరిశి
నాయుడు వేసిన
రేగాలమ్మ వర్ణచిత్రం

●రేగాలమ్మా.. కాపాడమ్మా..