
నగలు, నగదు చోరీపై ఫిర్యాదు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో చెరువు గట్టు వీధిలో నివాసం ఉంటున్న పిల్లి రాము ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పార్వతీపురం పట్టణ పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తన భార్య బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తన రోజువారీ పనుల నిమిత్తం చంటి బయటకు వెళ్లగా తిరిగి వచ్చి చూసేసరికి వేసిన తాళం వేసినట్లు ఉండి ఇంట్లో ఉన్న బీరువా తెరిచి బట్టలు చెల్లాచెదురుగా పడి ఉండడంతో దొంగతనం జరిగినట్లు పిల్లి రాము గుర్తించారు. ఈ చోరీలో ఐదు తులాల బంగారు ఆభరణాలతో పాటు, రూ.12 వేల నగదు అపహరించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.