
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్మితమవుతున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం పనులు వేగవంతం కావాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఆకస్మిక పర్యటనలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న ఆస్పత్రిని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఇంజినీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ ఆస్పత్రి అదుబాటులోకి వస్తే స్థానికంగా ఉన్న వారితో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ పర్యటనలో ఆస్పత్రి వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్