మే 1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు
● జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు
పార్వతీపురం టౌన్: జిల్లాలో వచ్చేనెల 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక క్రీడా కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శాప్ వీసీ, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 50 మందితో 50 వార్షిక క్రీడా శిబిరాలు నిర్వహించాలని ప్రతిపాదించామన్నారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు క్రీడా శిబిరాలు జరుగుతాయని తెలిపారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, పెన్సింగ్, హ్యెండ్ బాల్, హాకీ, కరాటే, కబడ్డీ, కోకో, కిక్‌బాక్సింగ్, తైక్వాండో, సాఫ్ట్‌బాల్, వాలీబాల్, యోగా వంటి క్రీడల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. చిన్నవయస్సులోనే ప్రతిభావంతులైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు.


