అర్జీదారులకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యం

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ 132 అర్జీలు స్వీకరణ

నరసరావుపేట రూరల్‌: అర్జీదారుల సమస్యలు సత్వరం పరిష్కరించి ఉత్తమ పోలీసు సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలతోపాటు బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 132 ఫిర్యాదులు జిల్లా ఎస్పీకి అందాయి. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృషి సారించి క్షేత స్థాయిలో విచారణ వేగవంతం చేసి చట్టప్రకారం న్యాయం చేయాలని అధికారులకు ఎస్పీ సూచించారు.

ఫిర్యాదుదారుల ఇబ్బందులు

తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదుదారులు సోమవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఉదయం 10గంటల నుంచి పీజీఆర్‌ఎస్‌ ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.30గంటలకు వరకు ప్రారంభం కాలేదు.

దీంతో అర్జీదారులు పీజీఆర్‌ఎస్‌ కేంద్రంలో అధికారుల పిలుపు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. వృద్ధులు, చంటి పిల్లలతో వచ్చిన వారు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడ్డారు. పీజీఆర్‌ఎస్‌ కేంద్రంలో అర్జీదారులకు సరిపడా కుర్చీలు లేకపోవడంతో చెట్ల కింద పడికాపులు కాయాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement