మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలి

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

నరసరావుపేట: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా సూచించారు. ఈ మేరకు అవగాహన పోస్టర్‌ను ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, మానసిక సమస్యల ప్రారంభ లక్షణాలను గుర్తించడం, అవసరమైన సమయంలో వైద్య సహాయం పొందడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో టెలీ–మానస్‌ సేవల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించి, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు సకాలంలో సహాయం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ చుక్కా రత్న మన్మోహన్‌న్‌, డీఆర్‌ఓ కె.అద్దెయ్య, డీఆర్‌డీఓ పీడీ ఝాన్సీరాణి, డ్రిప్‌ ఇరిగేషన్‌ శాఖ పీడీ ఆంజనేయులు, ఎన్‌టీఆర్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉద్యాన పంటలపై అవగాహన కోసం

విజ్ఞాన యాత్ర

జిల్లాలోని ఉద్యాన రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునాత వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేందుకు ఎంఐడీహెచ్‌ పథకం కింద కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు నిర్వహిస్తున్న రాష్ట్రేతర విజ్ఞాన యాత్రను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్ల సోమవారం కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంబించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి ఐ.వెంకటరావు మాట్లాడుతూ రైతులు కుప్పంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, తాళిలోని పూలు, అలంకరణ మొక్కల కేంద్రం, బెంగుళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌), ఇండో అమెరికన్‌ హైబ్రిడ్‌ సీడ్స్‌ సంస్థలను సందర్శిస్తారన్నారు. సుగంధ ద్రవ్య పంటలు, పూల మొక్కలు, అంటుకట్టిన, అంటుకట్టని కూరగాయల నారు ఉత్పత్తి, ఇజ్రాయేలు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక సాగు పద్ధతులు, సూక్ష్మ సేద్యం, తక్కువ నీటి వినియోగంలో పంటల సాగుపై రైతులు అవగాహన పొందుతారన్నారు. గులాబీ, జెర్పరా, ఆంథూరియం, కార్నేషన్‌ వంటి కట్‌ ప్లవర్‌ సాగు, అంలకరణ మొక్కల పెంపకం వ్యాప్తి పద్ధతులు తెలుసుకుంటారన్నారు. ఉద్యానశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

సందర్బంగా పోస్టర్‌ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement