నాదెండ్ల: నాదెండ్ల చైతన్య కాలనీకి చెందిన పుల్లగూర చైతన్య జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో అండర్–14 విభాగంలో ఎంపికయ్యాడు. గత పదిహేను రోజుల కిందట జిల్లాస్థాయిలో కారంపూడిలో జరిగిన జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీల్లో విజయం సాధించాడు. సోమవారం రాష్ట్రస్థాయిలో పోటీల్లో కారంపూడి జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో నిర్వహించారు. త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయిలో పోటీల్లో ఏపీ రాష్ట్రం తరపున రెజ్లింగ్ పోటీలలో పాల్గొననున్నాడు. క్రీడాకారుడు చైతన్య యడ్లపాడు మండలం బోయపాలెం అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చైతన్య తండ్రి పుల్లగూర నాగశరత్, పీజీటీ తెలుగు ఉపాధ్యాయుడిగా రాజాపేటలోని ఏపీ రెస్షిడియల్ స్కూల్లో
పనిచేస్తున్నాడు.
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు
డీఈఓ రామారావు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియేట్ దూరవిద్య కోర్సులలో ప్రవేశాలకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత గల అభ్యాసకులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 31వ తేదీ వరకు ఆయా కోర్సులలో ప్రవేశాల పొందవచ్చని వివరించారు. పాఠశాలకు వెళ్లే అవకాశం లేనివారు, మధ్యలో చదువు ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 14 సంవత్సరాలు వయస్సు నిండిన వారు 10వ తరగతి, అలాగే 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు ఇంటర్మీడియేట్‌లో ప్రవేశాలు పొందవచ్చని స్పష్టం చేసారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్‌తో రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా వివిధ కోర్సులలో ప్రవేశాలకు అర్హత ఉంటుందని తెలిపారు.
ఓఎస్‌సీ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత కార్యాలయం ఆధ్వర్యంలో నరసరావుపేట వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్‌సీ)లో ఖాళీగా ఉన్న పోస్ట్‌ను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా అధికారి ఎం.నాగమల్లీశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థినిలు htt pp:// palnadu.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకొని అన్ని ధ్రువపత్రాల నకళ్లను జత చేసి ఈనెల 20వ తేదీ లోగా జిల్లా కార్యాలయంలో అందచేయాలని కోరారు.
రాష్ట్ర యోగా ఓవరాల్ చాంపియన్‌గా గుంటూరు జిల్లా
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఈ నెల 10, 11 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 39వ రాష్ట్రస్థాయి యోగాసనా చాంపియన్‌షిప్‌ను గుంటూరు జిల్లా కై వసం చేసుకుందని జిల్లా కన్వీనర్ కొండా శ్రీలత సోమవారం తెలిపారు. పోటీల్లో 4 బంగారు, 5 రజిత, 3 కాంస్యలతో సహా మొత్తం 12 పతకాలు సాధించి క్రీడాకారులు మంచి పేరుతెచ్చాన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్‌లో డిసెంబర్ 27 నుంచి నిర్వహించనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారుల్ని రాష్ట్ర జనరల్ సెక్రటరీ అల్లాడి రవికుమార్ అభినందించారు.


