న్యూస్‌రీల్
పల్నాడు
సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 2,423 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు వేగం పెంచారు. కీలక అంశాలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆరు పురపాలక సంఘాలు, రెండు నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజనతో స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో రిజర్వేషన్ల ఖరారుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జనాభా ప్రాతిపదికన చేపట్టిన వార్డుల పునర్విభజనతో పట్టణాల్లో ప్రాతినిధ్యం మరింత పెరగనుంది.


