బాల వైభవం | - | Sakshi
Sakshi News home page

బాల వైభవం

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్‌ (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆదివారం అమ్మవారు శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల తర్వాత ఉదయం 8.30 గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి తొలి దర్శనం మంత్రి సుభాష్‌, కలెక్టర్‌ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని నూతన పూజామండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిిష్ఠించారు. పూజా మండపంలో గణపతి పూజ చేశారు. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మను శాసనసభ డెప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శత చండీహోమం, ప్రత్యేక శ్రీచక్రనవార్చనలను నిర్వహించగా, పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

లిప్టులు, అనధికార దర్శనాలు యథాతథం

క్యూలో విచ్చేసే వారికే తొలి ప్రాధాన్యమిస్తామని చెప్పిన ఆలయ అధికారులు ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ఉత్సవాల్లో తొలి రోజే లిఫ్టుల ద్వారా తమకు కావాల్సిన వారిని పోలీసు, దేవస్థాన కమిటీ సభ్యులు యథేచ్ఛగా కొండపైకి తీసుకువెళ్లి దర్శనాలు చేయించారు. మరోవైపున ప్రజాప్రతినిధుల తరఫున సేవా దళం ఆలయ పరిసరాల్లో తిరుగుతూ తమ వారికి దర్శనాలు చేయిస్తున్నారు. వన్‌టౌన్‌లోని ఓ సత్రంకు చెందిన సభ్యుడు సైతం ప్రొటోకాల్‌ డ్యూటీ చేయడం గమనార్హం. మెడలో కండువా, ఐడీ కార్డును ధరించి దర్జాగా దర్శనాలు చేయిస్తున్నా అడ్డుకునే వారే లేకపోయారు. వీకెండ్‌, వరస సెలువులు, దసరా ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కావడంతో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి కాళహస్తి, కాణిపాకం దేవస్థానాల నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు. అమ్మవారి లడ్డూ ప్రసాదాలు విక్రయించే ఆన్‌లైన్‌ కౌంటర్లు పని చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. నాలుగు ఆన్‌లైన్‌ కౌంటర్లు ఏర్పాటు చేసినా ఆదివారం మధ్యాహ్నం నుంచి సర్వర్‌ పని చేయలేదు.

బాలాత్రిపురసుందరిగా

దుర్గమ్మ దర్శనం

భక్తజనులకు కనుల పండువ

సామాన్య భక్తులకు ఇక్కట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement