న్యూస్‌రీల్
వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చేలా సరిహద్దుల మార్పు టీడీపీ నేతల ఒత్తిడితో పారదర్శకతకు తూట్లు నరసరావుపేట వార్డుల విభజన నోటిఫికేషన్‌పై వివాదాలు
ఆదివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9990 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
ఏళ్లుగా కలిసి ఉన్న ప్రాంతాలను అడ్డదిడ్డంగా విడదీస్తూ.. వైఎస్సార్‌సీపీ ఓటర్లను విడగొట్టేలా చేసిన కుతంత్రంలా నరసరావుపేట వార్డుల విభజన నోటిఫికేషన్ ఉందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అధికారం కోసం టీడీపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతూ చేపట్టిన ఈ పునర్విభజనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కూటమి కుతంత్రానికి నిదర్శనంగా ఈ ప్రక్రియ నిలిచింది.
నరసరావుపేట టౌన్: పారదర్శకంగా చేపట్టాల్సిన నరసరావుపేట మున్సిపాలిటీ వార్డుల పునర్విభజన వివాదాస్పదంగా మారింది. ప్రజల సౌకర్యార్థం జనాభా ప్రాతిపదికన జరగాల్సిన ప్రక్రియ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను విడగొట్టి, ఓట్ల సమీకరణాన్ని ప్రభావితం చేసేలా సరిహద్దులు మార్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నరసరావుపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 38 వార్డులు ఉండగా, శివారు ప్రాంతాలను కలుపుతున్న నేపథ్యంలో వాటి సంఖ్య 48కి పెరగనుంది. జనాభా, భౌగోళిక అనుసంధానం, పాలనా సౌలభ్యం వంటి అంశాల ఆధారంగా సరిహద్దులు నిర్ణయించాల్సి ఉండగా, రాజకీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
విభజనకు టీడీపీ కుట్ర..
వార్డుల పునర్విభజన ముసాయిదా రూపకల్పనకు ముందు మున్సిపల్ బంగ్లాలో టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. పురపాలక సంఘంపై అంతా తానై పెత్తనం చేస్తున్న టీడీపీ నేత ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నాడు. అతనితోపాటు టీడీపీ మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుతం పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న కొందరు వార్డు నాయకులు బంగ్లాకు వెళ్లి అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినట్లు సమాచారం. తమకు అనుకూలమైన ప్రాంతాలను నిర్దిష్ట వార్డుల్లో చేర్చేలా ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు, వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను విడగొట్టి వేర్వేరు వార్డుల్లో కలిపే ప్రయత్నాలు చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి కూడా వార్డుల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చేలా అధికారులపై ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా అశాసీ్త్రయ పద్ధతిలో అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతా అడ్డగోలుగా..
రెడ్డినగర్, పెద్దచెరువు, రామిరెడ్డిపేట ప్రాంతాలను మూడు ముక్కలుగా విభజించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా, మహాలక్ష్మీ నగర్‌ను సుదూర ప్రాంతంలోకి కలపడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరో వార్డులో ఉన్న దళిత ఓటర్లందరినీ ఏడో వార్డులో చేర్చడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్పు ఏ ప్రాతిపదికన చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై దళిత సంఘాలు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇస్లాంపేటలోని ఏడు, ఎనిమిది వార్డుల ప్రాంతాలను ఇతర వార్డుల్లో కలిపిన తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అభ్యంతరాలకు 14 వరకు గడువు..
వార్డుల పునర్విభజనపై మున్సిపల్ అధికారులు గురువారం ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించేందుకు మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన గడువు ఇచ్చారు. అభ్యంతరాల నేపథ్యంలో అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో మిగిలి ఉన్న 12 మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో రెన్యువల్ కాగా మిగిలిన 24 మద్యం దుకాణాలకు ఈనెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీసి 12 దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 12 దుకాణాలకు ఆదివారం నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 21వ తేదీ లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయిస్తామని తెలిపారు. నరసరావుపేట మండలంలో మూడు, నకరికల్లు, చిలకలూరిపేట పట్టణం, చిలకలూరిపేట రూరల్, నాదెండ్ల, సత్తెనపల్లి, వెల్దుర్తి, రొంపిచర్ల, పెదకూరపాడులలో ఒక్కొక్కటి చొప్పున మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి దుకాణానికి దరఖాస్తుతోపాటు ఫీజు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా, ఎన్ని షాపులకై నా చేసుకోవచ్చునని తెలిపారు.
మద్యం దుకాణాలకు మళ్లీ నోటిఫికేషన్


