కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ గోపిరెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం

నరసరావుపేట: ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం పనిచేసే కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఐదు రోజలుగా స్టేషన్‌రోడ్డులోని ధర్నా చౌక్‌ వద్ద మహా ధర్నా పేరుతో ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని గోపిరెడ్డి శనివారం సందర్శించి సంఘీభావం తెలిపారు. మెడికల్‌ ఉద్యోగుల జేఏసీ జిల్లా నాయకులు నాగరాజకుమారి, శాంతరాజ్‌ వారి డిమాండ్లు, సమస్యలు వివరించారు. డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వైఎస్సార్‌ సీపీ మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక డాక్టర్‌గా తనకు ఉద్యోగుల విలువ తెలుసునన్నారు. హాస్పిటల్స్‌ నిర్వహణలో డాక్టర్ల పాత్ర 50 శాతం ఉంటే పారా మెడికల్‌ సిబ్బంది పాత్ర కూడా అంతే ఉంటుందన్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని చూసుకోవడంలో వారి సేవలు మరువలేనివని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. 2023లో జీవో నెంబర్‌ 30 తీసుకొచ్చి 2014 ముందు ఎవరైతే పారామెడికల్‌ సిబ్బందిగా పనిచేస్తున్నారో వారందరినీ రెగ్యులరైజ్‌ చేసిన విషయం గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల వైఎస్‌ జగన్‌కు ఎంతో చిత్తశుద్ధి ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణమే వారి ఉద్యోగాలు రెగ్యులర్‌ చేయాలని, వారి న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే తీర్చాలని డిమాండ్‌ చేశారు.

సేవలను గుర్తించాలి

చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను తమ ప్రాణాలుగా భావిస్తూ సేవలు అందజేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి జీతాలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇంటలెక్చ్యువల్‌ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి మాట్లాడుతూ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఉద్యోగుల రెగ్యులర్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పలు విభాగాల నాయకులు షేక్‌ కరిముల్లా, పదముత్తం చిట్టిబాబు, పాలపర్తి వెంకటేశ్వరరెడ్డి, షేక్‌ ఖాజావలి మాష్టారు, కోడూరు వెంకటేశ్వరరెడ్డి, వై.వెంటప్పారెడ్డి, భవనం నరిసిరెడ్డి, జక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సుబ్రహ్మణ్యం నాయీ, మూరే రవీంద్రరెడ్డి, గుజ్జర్లపూడి ఆకాష్‌ కుమార్‌, నాలి ఆంజనేయులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement