మూడు విడతల్లో ‘స్థానిక’ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

మూడు విడతల్లో ‘స్థానిక’ ఎన్నికలు

Oct 9 2026 2:02 AM | Updated on Oct 9 2026 2:02 AM

మూడు విడతల్లో ‘స్థానిక’ ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్‌, ఎస్పీ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉండటమే కారణం

నరసరావుపేట: జిల్లాలో అత్యంత సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా స్థానిక సంస్థల పోలింగ్‌ ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించాలని పోలీసు శాఖతో సంప్రదించి ప్రతిపాదనలు సిద్ధం చేసినటు్‌ల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునీతకు వివరించారు. గురువారం విజయవాడ కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో పాటు సెక్రటరీలు మల్లికార్జునరావు, సంపత్‌ కుమార్‌లు స్థానిక ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్‌కు పల్నాడు జిల్లా కలెక్టరేట్‌ నుంచి జిల్లా ఎస్‌పీ జగదీష్‌ అదహళ్లి, సంయుక్త కలెక్టర్‌ సంజనా శ్రీహర్షతో కలిసి కలెక్టర్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు వేగంగా చేపడుతున్నటు తెలిపారు. ఎన్నికల సామగ్రి కొనుగోలు ప్రక్రియ చేపట్టడం జరిగిందని, ఇప్పటికే పోలింగ్‌ సామగ్రికి సంబంధించిన వర్క్‌ ఆర్డర్లు జారీ చేయడం జరిగిందన్నారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు సంబంధించి రాబోయే మూడు రోజుల్లో ప్రింటింగ్‌ ప్రెస్‌ను ఖరారు చేయనున్నామన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్‌ మాట్లాడుతూ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున భద్రతా సిబ్బంది కొరతను అధిగమించడానికి కనీసం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం భద్రతా పరంగా సహాయకరంగా ఉంటుందని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement