నరసరావుపేట: జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి కలెక్టర్ కార్యాలయంలో ఎకై ్సజ్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా లాటరీ తీసి దుకాణాలు కేటాయించారు. ఓపెన్ కేటగిరీలో నోటిఫికేషన్ చేసిన 24షాపులకు గాను 12 మద్యం షాపులకు సంబంధించి 49 దరఖాస్తులు రాగా, ఆయా అభ్యర్థుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా 12 షాపులు కేటాయించారు. చిలకలూరిపేటకు చెందిన మూడు, సత్తెనపల్లి ఆరు, మాచర్ల, వినుకొండ, ఈపూరు ఒక్కొక్క షాపును కేటాయించారు. మిగిలిన మద్యం షాపులకు 10వ తేదీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేయటం జరుగుతుందని జిల్లా ఎకై ్సజ్ ప్రొహిబిషన్ అధికారి మణికంఠ వెల్లడించారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ ప్రొహిబిషన్ అధికారి కె.రవీంద్ర, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా 12 దుకాణాలకు లాటరీ నిర్వహించిన అధికారులు


