గుంటూరువెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ నేతృత్వంలో అండర్–14 బాలుర క్రికెట్ ఎంపికలు ఈనెల 7, 8 తేదీల్లో ఏసీఏ గ్రౌండ్ పేరేచర్లలో నిర్వహించనున్నట్లు త్రీమెన్ కమిటీ సభ్యుడు నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–09–2012 లేదా ఆ తేదీ తర్వాత జన్మించిన బాలురు మాత్రమే ఈ ఎంపికలకు అర్హులన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, గత 3 సంవత్సరాల స్టడీ సర్టిఫికెట్, కిట్టు, బాల్ తెచ్చుకోవాలన్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో హాజరు కావాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన క్రీడాకారులందరూ ఉదయం 8 గంటలకు ఏసీఏ గ్రౌండ్, పేరేచర్లలో ఎంపికలకు హాజరు కావాలని తెలిపారు.


