ఉమ్మడి గుంటూరు జిల్లా ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి గుంటూరు జిల్లా ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

Oct 5 2026 1:03 AM | Updated on Oct 5 2026 1:03 AM

ఉమ్మడి గుంటూరు జిల్లా ఫుట్‌బాల్‌ జట్ల ఎంపిక

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్‌–14, అండర్‌–17 స్కూల్‌ గేమ్స్‌ జిల్లా జట్ల ఎంపిక ఆదివారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాకరపర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఎంపికల్లో రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ దాసరి కోటేశ్వరరావు హాజరై క్రీడాకారులను అభినందించారు. పల్నాడు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి లాకు పిచ్చయ్య ఆధ్వర్యంలో అండర్‌ –14 బాలుర జట్టు ఎంపికకు సెలక్షన్‌ కమిటీ సభ్యులుగా షేక్‌ మహమ్మద్‌ రియాజ్‌, షేక్‌ పెద కరీముల్లా, డి.వెంకటేశ్వర్లు, అండర్‌–17 బాలుర జట్టు ఎంపికకు కమిటీ సభ్యులుగా ఎన్‌.సురేష్‌, బి.అనీల్‌దత్తానాయక్‌, షేక్‌ గౌస్యాలు వ్యవహరించారు. ఎంపికలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 300 మంది క్రీడాకారులు, వివిధ పాఠశాలల నుంచి పీఈటీలు హాజరయ్యారు. అండర్‌ –14 బాలుర జట్టుకు ఆర్‌.చరణ్‌, ఆర్‌.జ్ఞానేశ్వరరావు, టి.సాయి వెంకటప్రసాద్‌, సీహెచ్‌ అఖిల్‌ జోసఫ్‌, పి.రామాంజనేయులు, ఎస్‌కే ఎండీ సమీర్‌ ఖాన్‌, టి రామ్‌సాయిరెడ్డి, కేఎస్‌ పృఽథ్వీ, వి. నిఖిల్‌, షేక్‌ దరియా హుస్సేన్‌, కె.గణేష్‌, జి.సూర్య, ఎస్‌కే బీ జానీ, ఎస్‌కే ఎండీ అర్షత్‌ వలి, జి.నిబీష్‌ సాయిరెడ్డి, వై ప్రవీణ్‌, కె.హేమంత్‌ సాయి, పి సాత్విక్‌, స్టాండ్‌ బైలుగా డి వివేక్‌, కె.హేమంత్‌ సాయి, కె.సాయి ధనుంజయరెడ్డి, కె.షణ్ముఖరెడ్డి, సీహెచ్‌ అతీష్‌లు ఎంపికయ్యారు. అండర్‌–17 బాలుర జట్టుకు బి.మను సిద్ధార్థ, ఎ.ప్రణీత్‌కుమార్‌, షేక్‌ జావీద్‌ ఆలం, పి.అంజన్‌ గోకుల్‌, పి.జోతేంద్రనాయుడు, ఎన్‌బీ ఎండీ రఫీ, ఎం.యశ్వంత్‌, జి.మంజునాథరెడ్డి, ఎ.చైతన్య, బి.మహేష్‌, కె.ఆకాష్‌, డి.అక్బర్‌ అలీ, ఎంవీఎస్‌ఎన్‌ అనీష్‌, యు. కౌశిక్‌, ఎంఎల్‌ మురళీకృష్ణ, వై. సీతయ్య, ఎం.కార్తీక్‌, సీహెచ్‌ జాలేంద్ర ప్రసాద్‌, స్టాండ్‌ బైలుగా డి హరిఫణీంద్ర వర్మ, ఎస్‌కేఎండీ సైఫుల్ల, ఎస్‌.కె.జియా ఉద్దీన్‌, పి.సన్నీ, బి.అజయ్‌లు ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement