దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

Oct 5 2026 1:03 AM | Updated on Oct 5 2026 1:03 AM

దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు రేషన్‌ బియ్యం పట్టివేత రైతు బజార్లలో రాయితీపై ఉల్లిపాయల విక్రయం

అమరావతి: అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వర ఆలయంలో 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సైదమ్మబాయి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది తొమ్మిది రోజులపాటు చండీహోమం నిర్వహిస్తున్నామని, 16వ తేదీ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేసి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. 19వ తేదీ రాత్రి 7.42 గంటలకు చండీ కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. శమీవృక్షం కింద ప్రత్యేక వేదికపై 20వ తేదీ రాత్రి స్వామి వారి గ్రామోత్సవం అరంతరం శమీపూజ నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం, సాయంత్రం భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీ చేస్తామన్నారు.

రేపు సహస్రఘటాభిషేకం

సమృద్ధిగా వర్షాలు కురవాలని అమరేశ్వరునికి మంగళవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6.54 గంటలకు వరుణయాగం, వరుణ జపం తర్వాత సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు.

తాడేపల్లిరూరల్‌: గుంటూరు రీజినల్‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదివారం తాడేపల్లి రూరల్‌ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి వడ్డేశ్వరం సర్వీస్‌ రోడ్‌లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న వాహనం ఆపి సోదా చేశారు. అందులో 90 బస్తాలలో 4,500 కిలోల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించామని పౌర సరఫరాల శాఖ ఆర్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. వాహనంతోపాటు డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ను తాడేపల్లి పోలీసులకు అప్పగించామని పేర్కొన్నారు. దుర్గాప్రసాద్‌తోపాటు షేక్‌ నాగుల్‌ మీరా, దారా శంకర్‌లపై 6ఏ కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

నేడు ఆర్చర్‌

జ్యోతి సురేఖ రాక

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ సోమవారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చి, అక్కడ నుంచి తాడేపల్లిలోని ఆమె నివాసానికి వెళతారు. జ్యోతి సురేఖకు స్వాగతం పలికేందుకు నగరంలోని క్రీడాకారులు, శాప్‌ సిబ్బంది గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. జపాన్‌లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో వరుసగా నాలుగు సార్లు దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన ప్రముఖ క్రీడాకారిణుల్లో జ్యోతి సురేఖ ఉన్నారు.

తెనాలిఅర్బన్‌: ఉల్లిపాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీపై వాటిని విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. తెనాలి శివాజీ చౌక్‌లోని రైతుబజార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఉల్లిపాయల రాయితీ విక్రయ కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. కిలో రూ. 35 చొప్పున పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 115 రైతుబజార్‌లో సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రోజూ 150 మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలను అందుబాటులోకి తెచ్చి విక్రయిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మొబైల్‌ కౌంటర్లు, మినీ లారీల ద్వారా వీటిని విక్రయించనున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి పద్మ, వివిధ విభాగాల డైరెక్టర్లు, పలువురు జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement