పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 నిమ్మకాయల ధరలు సాగర్‌ నీటిమట్టం పులిచింతల సమాచారం ఎస్‌ఐఆర్‌ అభ్యంతరాలపై కలెక్టర్‌ సమీక్ష బండ్లమోటు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు పిడుగురాళ్ల మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో కొను‘గోల్‌మాల్‌’

న్యూస్‌రీల్‌

మూడు కొటేషన్ల ఊసేది?

లోకల్‌ పర్చేస్‌ కమిటీ లేకుండానే ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు! సూపరింటెండెంట్‌ ఒంటెత్తు పోకడలపై విస్మయం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతోందంటూ విమర్శలు నిజ నిర్ధారణ కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని వైద్యుల డిమాండ్‌

ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5500, గరిష్ట ధర రూ.8500, మోడల్‌ ధర రూ.7000 వరకు పలికింది.

మాచర్ల: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం శనివారం సాయంత్రానికి 537.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నుంచి అవుట్‌ఫ్లో 35334 క్యూసెక్కులు ఉంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.0393 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతుంది.

నరసరావుపేట: ఓటర్ల జాబితా ప్రత్యేకత సవరణ (ఎస్‌ఐఆర్‌) నోటీసుల పరిశీలన, క్లెయిమ్స్‌, అభ్యంతరాలపై కార్యాలయంలో శనివారం కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులతో సమీక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి లాగిన్‌కు వచ్చిన పది అభ్యంతరాలను ఎలా పరిష్కరించాలో ఈఆర్వోలకు వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దయ్య, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ అధికారులు పాల్గొన్నారు.

బొల్లాపల్లి: బండ్లమోటు పోలీస్‌ స్టేషన్‌ను పల్నాడు జిల్లా ఎస్పీ జగదీశ్‌ అదహళ్లి శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. స్థానికంగా శాంతి భద్రతల గురించి ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలని, గట్టి నిఘా ఉంచాలని అన్నారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసి గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు, ఎస్బీ సీఐ ఆంథోని రాజు, వినుకొండ రూరల్‌ సీఐ బి బ్రహ్మయ్య, స్టేషన్‌ ఎస్‌ఐ సయ్యద్‌ షమీర్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ కృషితో ఏర్పాటైన పల్నాడు జిల్లావాసుల చిరకాల వాంఛ పిడుగురాళ్ల మెడికల్‌ కళాశాల ఆస్పత్రి టీడీపీ హయాంలో వివాదాలకు చిరునామాగా మారింది. ఇటీవల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సందర్భంగా అజెండా రూపకల్పనలో సూపరింటెండెంట్‌ హెఓడీలను కలుపుకొని పోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆస్పత్రిలో సర్జికల్‌, ఇతర పరికరాల కొనుగోలుకు లోకల్‌ పర్చేస్‌ కమిటీ వేయకుండానే నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, నిజనిర్ధారణ కమిటీ వేస్తే నిజాలు బయటకు వస్తాయని ఆస్పత్రి వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామంలోని మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఆసుపత్రిలో ఏ చిన్న వస్తువు లేదా సర్జికల్‌ పరికరం కొనుగోలు చేయాలన్నా ముందుగా ‘లోకల్‌ పర్చేస్‌ కమిటీ’ (ఎల్‌పీసీ) ఆమోదం పొందాల్సి ఉండగా, ఇప్పటివరకు ఆ కమిటీనే ఏర్పాటు చేయకపోవడం వెనుక అసలు ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఏకపక్ష నిర్ణయాలు, నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న కొనుగోళ్ల తీరుపై తోటి వైద్య బృందం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కమిటీ లేకుండానే..

సాధారణంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా పారదర్శకత కోసం లోకల్‌ పర్చేస్‌ కమిటీ ఉండాలి. కానీ, ఆసుపత్రి ప్రారంభమై అర్ధ సంవత్సరం గడుస్తున్నా నేటికీ ఆ కమిటీని ఏర్పాటు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కమిటీ ఉంటే ప్రతి కొనుగోలుకు లెక్క చూపాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే కావాలనే కమిటీని ఏర్పాటు చేయలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

అంతా నా ఇష్టం..!

హాస్పిటల్‌లో కొనుగోళ్ల వ్యవహారమంతా ఆస్పత్రి హెడ్‌ తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ‘ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు, అంతా నా ఇష్టమే‘ అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తున్న తీరుపై తోటి వైద్యులు, సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కొంతమంది క్లినికల్‌ వ్యాపారుల దగ్గర నుంచే నిబంధనలకు విరుద్ధంగా సర్జికల్‌ వస్తువులు కొనుగోలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పై అధికారులకు తెలిసే జరుగుతోందా..?

ఇంత జరుగుతున్నా పై అధికారులకు ఈ విషయాలు తెలియదా? లేక అంతా తెలిసి కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోళ్లలో జరుగుతున్న ఈ అక్రమాల వెనుక కొందరికి ముడుపులు, వాటాలు అందుతున్నాయా? అనే కోణంలో వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆస్పత్రి హెడ్‌ తీరుకు ఆశ్చర్యపోతున్న తోటి వైద్య బందం, ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. స్పందించి ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి, ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

త్వరలోనే ఏర్పాటు చేస్తాం...

ఈ విషయంపై హాస్పిటల్‌ ఏఓ రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇంకా లోకల్‌ పర్చేస్‌ కమిటీ ఏర్పాటు చేయలేదని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం వస్తువులు కొనుగోలు బాధ్యత గుంటూరు వారికి అప్పగించామని, వారే వస్తువులు అందిస్తున్నారని తెలిపారు.

జనరల్‌ ఫైనాన్షియల్‌ రూల్స్‌ (జీఎఫ్‌ఆర్‌ – నిబంధన 155) ప్రకారం ఆస్పత్రికి ఏదైనా కొనుగోలు చేయాలంటే కనీసం ముగ్గురు వేర్వేరు సరఫరాదారుల నుంచి పోటీ ధరలతో కూడిన మూడు కొటేషన్లు రావాలి. కానీ పిడుగురాళ్ల మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో అసలు ఆ కొటేషన్లు వచ్చాయా? లేదా? అన్నది పెద్ద ప్రశ్న. ఎలాంటి పారదర్శకత లేకుండా అడ్డదిడ్డంగా కొనుగోళ్లు జరుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర మరియు సర్జికల్‌ వస్తువుల కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే రోగుల ప్రాణాలకే ప్రమాదం. తక్కువ నాణ్యత గల వస్తువులను కొనుగోలు చేసి, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement