పోస్టల్‌ కాలనీలో పట్టపగలు చోరీ | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ కాలనీలో పట్టపగలు చోరీ

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

పోస్టల్‌ కాలనీలో పట్టపగలు చోరీ

నరసరావుపేట రూరల్‌: పట్టపగలే చోరీ ఘటన పోస్టల్‌ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. తాళాలు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలో దాచిన 76 గ్రాముల బంగారం, రూ.50వేల నగదును చోరీ చేశారు. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. పోస్టల్‌కాలనీలోని సాయి తిరుమల అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఉన్న ఇంట్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సంఘమిత్ర నివసిస్తున్నారు. శనివారం పాఠశాలకు సెలవు పెట్టిన సంఘమిత్ర ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం వచ్చి చూడగా ఇంటి వెనుక తలుపు తీసి ఉంది. బెడ్‌రూమ్‌ను పరిశీలించగా కబోర్డులో దాచిన బంగారం, నగదు మాయం అయినట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ కిషోర్‌లు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌తో నిందితుల నమూనాలను సేకరించారు. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement