అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

శావల్యాపురం: అనధికార లేఅవుట్లు వేయటం చట్టారీత్యా నేరమని జిల్లా జాయింట్‌ కలక్టరు సంజనా శ్రీహర్ష హెచ్చారించారు. శనివారం ఉదయం మండలంలోని కనమర్లపూడి గ్రామ సమీపాన పెదకంచర్ల చప్టా ఎదురుగా జాతీయ రహదారి వెంబడి నూతనంగా ఏర్పాటు చేసిన సర్వే నంబరు 241, 42, 43, 44, పట్టా ల్యాండులో సూమారు 40 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అనధికార వెంచను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి అనుమతులు లేకపోవటం, చౌడు భూమి కావటం వెంటనే పొక్లెక్లయిన్‌తో సరిహద్దురాళ్లు, రహదారి పనులను తొలిగింపజేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు మేరకు అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. జిల్లావ్యాప్తంగా 25 అక్రమ లేఅవుట్లు ఉండగా అందులో వినుకొండ పట్టణ పరిధిలోనే 15 అనధికారి లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నోటీసులు ఇచ్చినా స్పందించని లేఅవుట్లను కూల్చివేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా వినుకొండ – గుంటూరు 544–డి రహదారి పనులు ప్రారంమైనట్లు జిల్లా కలెక్టరు సంజనా శ్రీహర్ష స్పష్టం చేశారు. ఆరు నెలల వ్యవధిలో సంబంధిత భూముల యజమానులకు నోటీసులు అందజేసి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారి ప్రేమ్‌చందు, జేఏఓ లక్షణస్వామి, తహసీల్దార్‌ ఎం.అర్జున్‌నాయక్‌, ఎంపీడీఓ పేరుమీనా సీతారామయ్య, మండల సర్వేయర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

అక్రమ లేఅవుట్లు ధ్వంసం..

వినుకొండ: వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా వెలసిన అనధికార లేఅవుట్లపై జేసీ సంజన శ్రీహర్ష చర్యలు చేపట్టారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన లేఅవుట్లను పొక్లెయిన్లతో కూల్చివేశారు. అధికారులు మాట్లాడుతూ సాధారణ ప్రజలు లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేముందు ఒకటికి రెండుసార్లు డీటీసీపీ, యూడీఏ ఆమోదం ఉందో లేదో ఖచ్చితంగా సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవలం గ్రామ పంచాయతీ అనుమతుల పేరుతో విక్రయంచే లేఅవుట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. లేఅవుట్ల ఆమోద వివరాల కోసం సంబంధిత కార్యాలయాల్లోని ప్రత్యేక విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనా శ్రీహర్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement