ప్రజా సేవ లేదు.. ప్రచారమే | - | Sakshi
Sakshi News home page

ప్రజా సేవ లేదు.. ప్రచారమే

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

ప్రజా సేవ లేదు.. ప్రచారమే టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకే..

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.

సీన్‌ కట్‌ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

వలంటీర్లు గ్రామాల్లో ప్రజలకు అండగా నిలిచారు. వాళ్లను కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల అనంతరం తొలగించడం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే. ఇప్పుడు అదే ప్రభుత్వం ప్రచారం కోసం భారీగా ఖర్చు చేయడం అర్థంలేని నిర్ణయం. ముందు వలంటీర్లకు న్యాయం చేయాలి. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.

– కొక్కిలిగడ్డ వీరరాజు,

మాజీ వలంటీరు, గుళ్లపల్లి

గత ప్రభుత్వం వలంటీర్లకు రూ. 5వేలు ఇస్తేనే ప్రజాధనం దుర్వి నియోగం చేస్తున్నారంటూ ఎల్లో మీడియాలో టీడీపీ డప్పుకొట్టింది. తాజాగా టీడీపీ ప్రభుత్వం సోషల్‌ మీడియా కార్యకర్తలకు రూ.లక్షలు దోచి పెట్టేందుకు సిద్ధమైంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు భారీ వేతనాలు ఇవ్వడం దారుణం. ఇదంతా టీడీపీ సోషల్‌ మీడియా బ్యాచ్‌కి లబ్ధి చేకూర్చే యత్నం తప్ప ఇంకేమీ లేదు. సేవ చేసే వారికి ఇస్తే బాగుంటుంది.

– ఆరమళ్ల కరుణాకర్‌, మాజీ వలంటీర్‌, మల్లెపాడు, తెనాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement