లిఫ్ట్‌లో నుంచి పడి బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌లో నుంచి పడి బాలిక మృతి

Aug 24 2026 7:03 AM | Updated on Aug 24 2026 7:03 AM

ఆడుకునేందుకు వెళ్లిన బాలిక రక్తపు మడు గులో ప్రత్యక్షం

వైద్యశాలకు తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు

ఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ డాక్టర్‌ కృష్ణ చైతన్య

సత్తెనపల్లి: అప్పుటి వరకు ఇంట్లో తల్లిదండ్రులు, సోదరుడితో ముచ్చట్లు... పాఠశాలకు సెలవు కావడంతో ఆడుకునేందుకు వెళ్లి లిఫ్ట్‌లో నుంచి పడి బాలిక మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వడ్డవల్లి పోలేరమ్మ గుడి సెంటర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లోని ఓ హోల్‌సేల్‌ పచారీ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న భవిరిశెట్టి మహేష్‌, మణిదీపిక దంపతులకు కుమారుడు లోకేష్‌, కుమార్తె రేవతి ఉన్నారు. రేవతి పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి విద్యనభ్యసిస్తోంది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో పాటు తండ్రి మహేష్‌ కూడా సెలవు కారణంగా ఇంటి వద్ద ఉన్నాడు. అప్పటి వరకు తల్లి దండ్రులు, సోదరుడితో సరదాగా గడిపిన రేవతి మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో స్నేహితులైన వేద కార్తిక్‌లతో ఆడుకునేందుకు తమ ఇంటి సమీపంలోని దొరేడ్ల కోటేశ్వరరావు చెందిన మూడంతస్తుల భవనం వద్దకు వెళ్లింది. భవన యజమాని కోటేశ్వరరావు నెల క్రితం మూడు అంతస్తుల ఇంటికి లిఫ్ట్‌ పెట్టించాడు. లిఫ్ట్‌లో వెళ్ళి బటన్‌ నొక్కిన రేవతి ఏం జరిగిందో తెలియదు కానీ కింద అంతస్తుకి నాలుగు అడుగుల ఎత్తులో ఒక్కసారిగా లిఫ్ట్‌ ఆగి పోవటంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించి పడి పోయిందా.. లేక ఏమి జరిగిందనేది అర్థం కావటంలేదు. రేవతి చెప్పులు లిఫ్ట్‌లో నుంచి కిందకు పడటం, ఆమె పడి రక్తపు మడుగులో కనిపించింది. హుటాహుటిన ఆమెను పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే బాలిక రేవతి(12)మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతురాలి తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతురాలి తల్లి మణిదీపిక మాట్లాడుతూ తమ కుమార్తె లిఫ్ట్‌లో నుంచి రక్తం మడుగులో పడటం ఏమిటో అర్థం కావడం లేదని, ఇంత జరిగినప్పటికీ ఇంటి యాజమాన్యం కనీసం బయటకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అనుమానం వ్యక్తచేసింది. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు ఎదుట విలపించింది. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి డీఎస్పీ డాక్టర్‌ ఎంవీ కృష్ణచైతన్య, పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ సందర్శించారు. పోలేరమ్మ గుడి సెంటర్‌ సమీపంలోని ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలం వద్దకు చేరుకోవడం తో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement